Begin typing your search above and press return to search.

భార్య‌కు ప్రేమతో 10/10 మార్కులేసిన చై

By:  Tupaki Desk   |   19 May 2021 5:00 PM IST
భార్య‌కు ప్రేమతో 10/10 మార్కులేసిన చై
X
అక్కినేని స‌మంత తొలిసారి ఓ వెబ్ సిరీస్ లో న‌టిస్తుండ‌డం .. అది కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ సిరీస్ `ఫ్యామిలీమ్యాన్` సెకండ్ సీజ‌న్ లో అడుగుపెడుతుండ‌డం అభిమానుల్లో ఉత్కంఠ పెంచింది. మొద‌టి లాక్ డౌన్ స‌మ‌యంలో దాదాపు తెలుగు ప్రేక్ష‌కులంతా వీక్షించిన ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ కి కొన‌సాగింపు భాగంలో స‌మంత ఓ కీల‌క పాత్ర పోషిస్తోంద‌ని నెగెటివ్ షేడ్ ఉంటుంద‌ని లీకులు అంద‌డంతో ఇంత‌కుముందే ఉత్కంఠ పెరిగింది.

ఆ ఉత్కంఠ‌కు త‌గ్గ‌ట్టే నేడు రిలీజైన `ది ఫ్యామిలీ మ్యాన్ 2` ట్రైల‌ర్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించింది. ఈ ట్రైల‌ర్ లో సామ్ న‌ట‌నకు ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌తో నిజంగానే స‌మంత స‌ర్ ప్రైజ్ చేశారు. ల‌క్ష‌లాది లైక్ లు క్లిక్ ల‌తో ట్రైల‌ర్ దూసుకెళుతోందంటే అది సామ్ క్రెడిట్. ట్రైలర్ లో నిస్సందేహంగా సమంతా అక్కినేని పాత్ర‌చిత్ర‌ణ హైలైట్ గా నిలిచింది. మొట్టమొదటిసారిగా నెగటివ్ రోల్ పోషిస్తున్న సామ్ మునుపెన్నడూ లేని పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సమంతకు అభినందనలు ప్రవహిస్తున్నాయి. కానీ ఆమె భర్త హీరో నాగ చైతన్య నుండి స్పంద‌న ఎలా ఉంది? అంటే..

అది ఇంకా ఊహించ‌నిది. `లవ్ ఇట్! 10/10` అంటూ భార్యామ‌ణి న‌ట‌న‌కు ఫుల్ మార్కులేశారు చైతూ. కానీ దానికి సమంత ప్ర‌తిస్పందన చాలా వింతగా ఉంది. అస‌లు నచ్చిందా లేదా అని సామ్ ఆస‌క్తిగా వేచి చూసారు. హబ్బీ రెస్పాన్స్ రాగానే..`రెడ్ హార్ట్` ఈమోజీతో ప్రేమ‌ను వ్య‌క్తం చేశారు సామ్. చై-సామ్ అన్నివేళ‌లా అంద‌రినీ ఆక‌ర్షించే పెయిర్. వారి మ‌ధ్య అన్యోన్య‌త‌.. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి ప్ర‌తిసారీ ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటారు. అన్న‌ట్టు స‌క్సెస్ ఫుల్ ఫిలింమేక‌ర్స్ రాజ్ అండ్ డీకే .. సామ్ - చై జంట‌పై ఏదైనా సినిమాని ప్లాన్ చేస్తున్నారా? అన్న‌ది వేచి చూడాలి.