Begin typing your search above and press return to search.

చై-శోభిత డేటింగ్ రూమర్స్: కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్న బాలీవుడ్ మీడియా..!

By:  Tupaki Desk   |   20 July 2022 6:30 AM GMT
చై-శోభిత డేటింగ్ రూమర్స్: కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్న బాలీవుడ్ మీడియా..!
X
అక్కినేని నాగచైతన్య విషయంలో డేటింగ్ రూమర్లు అనేవి కొత్తేమీ కాదు. సమంత రూత్ ప్రభు తో విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో ఎఫైర్స్ అంటగడుతూ పుకార్లు పుట్టుకొచ్చాయి. 'లాల్ సింగ్ చద్దా' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న చైతూ వ్యక్తిగత జీవితం పై అక్కడి మీడియా ఇప్పటికే పలు రూమర్స్ ను స్ప్రెడ్ చేసింది.

సామ్ తో విడిపోయిన తర్వాత నాగచైతన్య ప్రస్తుతం 'గూఢచారి' ఫేమ్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నాడంటూ ప్రముఖ బాలీవుడ్ మీడియాలో వార్తలు రావడం ఇటీవల ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కొత్తగా నిర్మిస్తున్న చైతూ ఇంట్లో ఇద్దరూ కనిపించారని.. 'మేజర్' ప్రమోషన్స్ టైంలో శోభిత బస చేసిన హోటల్ కు చై పలుమార్లు వెళ్లాడని రిపోర్ట్ చేసాయి.

ఆ తర్వాత కొన్ని రోజులు సైలెంట్ అయిపోయిన బాలీవుడ్ మీడియా ఇప్పుడు మళ్లీ మొదలు పెట్టింది. చైతన్య - శోభిత మధ్య అఫైర్ నడుస్తుందని నిరూపించడానికి ఇద్దరికీ ఇష్టమైన 'ఫార్ములా వన్' తో లింక్ పెడుతోంది.

నాగచైతన్య ఫార్ములా వన్ కు పెద్ద అభిమాని అనే సంగతి తెలిసిందే. గతంలో అనేకసార్లు రేసులో కూడా పాల్గొన్నాడు. తన మాజీ భార్య సమంతా రూత్ ప్రభుతో కలిసి రేసింగ్ ట్రాక్ లపై కనిపించాడు. అయితే ఇప్పుడు శోభితా ధూళిపాళ్ల ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో F1 గురించి ప్రస్తావించడంతో చైతూ తో కనెక్షన్ ఉందనే విధంగా బాలీవుడ్ మీడియా కథనాలు అల్లుతోంది.

ఇన్స్టాగ్రామ్ ఓ శోభిత తాజాగా తన ఫాలోవర్స్ తో చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ "మీరు ఫార్ములా 1ని ఇష్టపడతారా?" అని ప్రశ్నించాడు. దీనికి ఆమె నేరుగా సమాధానం చెప్పకుండా.. ఓ ఇమేజ్ తో జవాబు ఇచ్చింది. ఇందులో శోభిత కారులో కూర్చొని నవ్వు కనబడనీయకుండా చేతిని అడ్డుపెట్టుకుని కనిపిస్తోంది. ఆమె ధరించిన స్వెట్ షర్ట్ పై మెక్ లారెన్ అని రాసి ఉండటాన్ని గమనించవచ్చు.

ఇలా నాగచైతన్య - శోభిత ఇద్దరూ ఫార్ములా వన్ రేసును ఇష్టపడుతుండటంతో.. ఈ ఇద్దరూ తమ 'సీక్రెట్' సంబంధాన్ని కొనసాగిస్తున్నారని ఓ ప్రముఖ మీడియా చెబుతోంది. దీనిపై టాలీవుడ్ సినీ అభిమానులు కౌంటర్లు వేస్తున్నారు. బాలీవుడ్ మీడియా కోడిగుడ్డు మీద ఈకలు పీకుతోందని కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తుల ఇష్టాలు కలవడం అనేది కామన్. అంత మాత్రానికే వారి మధ్య ఏదో ఉందని నివేధించడం ఎంత వరకు కరెక్ట్ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

నిజానికి విడాకుల ప్రకటన తర్వాత నాగచైతన్య ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. కెరీర్ మీదనే ఫుల్ ఫోకస్ పెట్టి వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. 'థ్యాంక్యూ' ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుండగా.. ఆమిర్ ఖాన్ తో కలిసి నటించిన హిందీ సినిమా 'లాల్ సింగ్ చద్దా' ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలానే తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు చైతూ. ఇందులో పోలీస్ గా కనిపించనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. దీని తర్వాత పరశురాం దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇక విక్రమ్ కె కుమార్ తో కలిసి అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం 'దూత' అనే హారర్ వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఇది చై కి ఓటీటీ డెబ్యూ కావడం విశేషం.