Begin typing your search above and press return to search.

లిప్ లాక్.. తెలుగు హీరోయిన్ కెరీర్ కు క‌లిసొచ్చేనా?

By:  Tupaki Desk   |   17 Jun 2022 8:30 AM GMT
లిప్ లాక్.. తెలుగు హీరోయిన్ కెరీర్ కు క‌లిసొచ్చేనా?
X
టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్ లుగా నిల‌దొక్కుకున్న సంద‌ర్భాలు చాలా త‌క్కువే. అప్ప‌ట్లో అయితే లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి నుంచి చాలా మంది తెలుగు హీరోయిన్ లు సినిమాల్లో రాణించారు. మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. కానీ ప్ర‌స్తుతం ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. తెలుగు సినిమాలో తెలుగు వుంటోంది కానీ తెలుగు హీరోయిన్ మాత్రం క‌నిపించ‌డం లేదు. దీనిపై చాలా మంది చాలా ర‌కాలుగా కామెంట్ లు చేస్తూనే వున్నారు.

అయినా మ‌న మేక‌ర్స్ డిమాండ్ అండ్ స‌ప్లై అనే ఫార్ములా ప్ర‌కార‌మే హీరోయిన్ ల‌ని త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. దీంతో తెలుగు అమ్మాయిల‌కు తెలుగులో అవ‌కాశాలు ల‌భించ‌డం లేదు. కొంత మంది త‌మిళ ఇండ‌స్ట్రీలో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటుంటే మ‌రి కొంత మంది మాత్రం ఇక్క‌డే ట్రై చేద్దాం అంటూ ఇషా రెబ్బా, చాందిని చౌద‌రి లాంటి తెలుగు హీరోయిన్ లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

చాందిని చౌద‌రి ఇప్పుడిప్పుడే వ‌రుస సినిమాల‌తో బిజీ అవుతోంది. వెబ్ సిరీస్ ల‌తో పాటు సినిమాల్లోనూ న‌టిస్తూ య‌మ బిజీగా గ‌డిపేస్తోంది. ఆమె న‌టించిన 'క‌ల‌ర్ ఫొటో' ఆహా ఓటీటీలో విడుద‌లై సూప‌ర్ హిట్ అనిపించుకుంది.

ఆ త‌రువాత ఆ స్థాయి హిట్ కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం టాలెంటెడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టిస్తున్న మూవీ 'స‌మ్మ‌త‌మే'. ఈ చిత్రంలో చాందిని చౌద‌రి హీరోయిన్ గా న‌టించింది. గోపీనాథ్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ జూన్ 24న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ ని ప్రారంభించింది. తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్ ని విడుద‌ల చేసింది. ప‌బ్ క‌ల్చ‌ర్ కు అల‌వాటు ప‌డిన అమ్మాయిగా చాందిని చౌద‌రి క‌నిపిస్తోంది. అలాంటి అమ్మాయిని ప్రేమించే యువ‌కుడిగా కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టించాడు. ఇద్ద‌రి మ‌ధ్య లిప్ లాక్ సీన్ లు వున్న‌ట్టుగా ట్రైల‌ర్ స్ప‌ష్టం చేస్తోంది.

కెరీర్ గాడిన ప‌డి స్పీడందుకోవాలంటే బోల్డ్ క్యారెక్ట‌ర్స్ కి ఓకే చెప్పాల్సిందే అని చాందిని చౌద‌రి నిర్ణ‌యించుకుంద‌ని, ఆ కార‌ణంగానే లిప్ లాక్ ల‌కు ఓకే చెప్పింద‌ని అంటున్నారు. మ‌రి ఈ సినిమాతో అయినా ఈ వైజాగ్ బ్యూటీకి కాలం క‌లిసి వ‌చ్చేనా? అని ఇండస్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.