Begin typing your search above and press return to search.

`అఖండ‌`కు సెన్సార్ యుఏ స‌ర్టిఫికెట్

By:  Tupaki Desk   |   22 Nov 2021 3:29 AM GMT
`అఖండ‌`కు సెన్సార్ యుఏ స‌ర్టిఫికెట్
X
న‌ట‌సింహా నంద‌మూరి బాలకృష్ణ నటించిన `అఖండ` డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే.. ఆదివారం ఉదయం ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. సెన్సార్ UA సర్టిఫికేట్ తో ఆమోదించింది. తాజాగా పోస్ట్-ప్రొడక్షన్ పై సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ కీల‌క స‌మాచారం అందించారు.

ప్ర‌స్తుతం డాల్బీ .. డాల్బీ అట్మాస్ మిక్సింగ్ శరవేగంగా జరుగుతోందని థ‌మ‌న్ తెలిపారు. ఇటీవల విడుదలైన అఖండ థియేట్రికల్ ట్రైలర్ లో థమన్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన హైలైట్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. మిలియ‌న్ల వ్యూస్ తో ట్రైల‌ర్ అభిమానుల్లోకి దూసుకువెళ్లింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థ‌మ‌న్ నుండి ఔట్ అండ్ అవుట్ మాస్ మ్యూజికల్ ట్రీట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

శ్రీకాంత్- జగపతి బాబు- ప్రగ్యా జైస్వాల్- పూర్ణ ప్రధాన పాత్రల్లో నటించిన అఖండ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఇందులో శ్రీ‌కాంత్ క్రూర‌మైన విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా.. జ‌గ‌ప‌తి బాబు ఆస‌క్తిక‌ర పాత్ర‌లో న‌టిస్తున్నారు. బాల‌య్య‌తో నువ్వా నేనా? అంటూ త‌ల‌ప‌డేవాడిగా శ్రీ‌కాంత్ క‌నిపించ‌నున్నారు.