Begin typing your search above and press return to search.

ఓటీటీలకు సెన్సార్.. కేంద్రం సంచలనం

By:  Tupaki Desk   |   25 Feb 2021 8:00 PM IST
ఓటీటీలకు సెన్సార్.. కేంద్రం సంచలనం
X
దేశంలో థియేటర్ల వ్యవస్థను దెబ్బతీస్తూ దేశ సినీ పరిశ్రమకు దెబ్బగా పరిగణించబడిన ‘ఓటీటీ’లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా లాక్ డౌన్ వేళ ఈ ఓటీటీల ద్వారానే సినిమాలన్నీ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఓటీటీలతో సినిమా పరిశ్రమకు కొంత నష్టం చేకూరుతోంది.

అంతేకాకుండా సినిమాల్లో లాగా సెన్సార్ ఓటీటీలకు రాదు. దీంతో లైవ్ శృంగారం, అసహజ దృశ్యాలు ఎక్కువైపోయి విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ క్రమంలోనే ఓటీటీ, డిజిటల్ ఫ్లాట్ ఫాంలలో రిలీజ్ అయ్యే కంటెంట్ పై కేంద్రం కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఇక నుంచి ఏజ్ ఆధారంగా 5 కేటగిరీల్లో కంటెంట్ రానుంది.

అన్ని వయసుల వారు చూసేలా యూనివర్సల్ కంటెంట్ తీసుకురావాలని కేంద్రం గైడ్ లైన్స్ లో పేర్కొంది. పబ్లిష్ చేసే కంటెంట్ పై పూర్తి సమాచారం ఇవ్వాలని ఓటీటీ సంస్థలను కోరింది. గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని.. రిటైర్డ్ జడ్జీలతో సెల్ఫ్ రెగ్యులేషన్ కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.

ఇక ఓటీటీలకు సెన్సార్ బోర్డులాగా ప్రత్యేక విధానం తీసుకురానున్నారు.దీంతో ఇక శృంగారం, అసహజ సీన్లకు ఓటీటీలో కత్తెరపడనుంది.