Begin typing your search above and press return to search.

ఆమె ఉంటే కంచె పడిపోయేదే

By:  Tupaki Desk   |   23 Oct 2015 11:36 AM IST
ఆమె ఉంటే కంచె పడిపోయేదే
X
కొన్ని నెలల క్రితం వరకూ తెలుగు సెన్సార్ బోర్డ్ లో ధనలక్ష్మి అనే ఆవిడ ఆఫీసర్ గా ఉండేది. ప్యానల్ లో ఈవిడ పేరుంటే నిర్మాతలు జడుసుకునేవారు. మా ఖర్మ అనుకుంటూ తల కొట్టుకునేవారు. మరి ఆవిడ ఉండగా డబుల్ మీనింగ్ లు - లిప్ లాక్ లు - అందాలపై క్లోజప్ షాట్లు కుదరవు మరి. అయితే.. అన్నిసార్లు ఇవి చీప్ పబ్లిసిటీ కోసం వాడుకునేవి కావు. కొన్నింటికి స్టోరీతో చాలా అటాచ్ మెంట్ ఉంటుంది. ఆ సీన్ లేకపోతే స్టోరీలో కిక్ రాదనిపించేవి కొన్నుంటాయి. అలాంటి వాటిని కూడా నిర్దాక్షిణ్యంగా కట్స్ విధించేది ధనలక్ష్మి.

ఒకవేళ ఆవిడ కానీ ఇప్పుడుంటే కంచెలో ఓ అద్భుతమైన సీన్ ప్రేక్షకులకు ఖచ్చితంగా దూరమయ్యేది. ఇందులో ఓ ఫారిన్ లేడీని టాప్ లెస్ గా చూపించారు. తన చేతులతో ఎదభాగాన్ని కవర్ చేసుకునేలా షూట్ చేశారు. ఇది కంచెలో చాలా కీలకమైన సీన్. కథలో ఎమోషన్స్ ను నింపే సన్నివేశం ఇది. నిజానికి ఇలాంటి సీన్స్ ఉంటే ఏ సర్టిఫికేట్ అంటారు సెన్సార్ వాళ్లు. కానీ కంచెకి మాత్రం యూ/ఏ దక్కింది. దీనికి ప్రధాన కారణం ఆ సీన్ కి, స్టోరీలో ఉన్న ఇంపార్టెన్సే. ఇప్పుడు కాబట్టి ఇది చెల్లుబాటయిపోయింది కానీ.. అదే ధనలక్ష్మి ఉంటే మాత్రం ఖచ్చితంగా కోతపడిపోయేదే.

అయితే.. ఇప్పటికీ కొంతమంది ఆ సన్నివేశంపై అబ్జెక్షన్స్ చెబుతున్నారనుకోండి. కాకపోతే.. వాళ్లకి దాని ఇంటెన్సిటీ తెలీడం లేదని అలా అన్నవాళ్ల పక్కనున్నోళ్లే విమర్శించడం హైలైట్.