Begin typing your search above and press return to search.

‘బాహుబలి-2’ ట్రైలర్.. ఎవరేమన్నారు?

By:  Tupaki Desk   |   17 March 2017 5:21 AM GMT
‘బాహుబలి-2’ ట్రైలర్.. ఎవరేమన్నారు?
X
నిన్న విడుదలైన ‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్ జనాల మతులు పోగొట్టింది. ఈ ట్రైలర్ గురించి సెలబ్రెటీలు ఏమన్నారో చూద్దాం పదండి.

‘‘ట్రైలర్ చూశాక మాటల్లేవు. వెండితెరకు మాటలు వస్తే ‘నాపై ఇంతటి అద్భుతాన్ని ఆవిష్కరిస్తారనుకోలేదు’ అంటూ ఆశ్చర్యపోతుందేమో. ఈ చిత్రానికి పని చేసిన నటీనటులు.. సాంకేతిక నిపుణులు అదృష్టవంతులు. ట్రైలర్ చూశాక ప్రేక్షకులకు ఇంకో నెల రోజులు ఎలా ఆగుతారో నాకు తెలియదు. నా వల్ల అయితే కాదు. ఈ ట్రైలర్ని ప్రతి రోజూ పదిసార్లయినా చూస్తా’’
-కె.రాఘవేంద్రరావు

‘‘ఇలాంటి అనుభవం ఇంకేదీ ఇవ్వదు. పల్స్ పెరుగుతుంది. శ్వాస ఆగిపోతుంది. కళ్లప్పగించి చూస్తూనే ఉంటారు. జక్కన్న అండ్ టీంకు కుడోస్’’
-జూనియర్ ఎన్టీఆర్

‘‘రాజమౌళి బుర్ర ఎలా పని చేస్తుందో చెప్పే క్లాసులకు నేను నా పేరును నమోదు చేసుకుంటా’’
-సమంత రూత్ ప్రభు

‘‘తప్పకుండా రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే ట్రైలర్ ఇది. ఈ ట్రైలర్ అద్భుతంగా ఉంది. అందరికీ అభినందనలు’’
-నందమూరి కళ్యాణ్ రామ్

‘‘ఈ రోజు బాహుబలి-2 ట్రైలర్ చూడటానికి ఎగ్జైట్ అయినంతగా ఇంకెప్పుడూ ఎగ్జైటవ్వలేదు. సినిమా కోసం ఇక ఆగలేకపోతున్నా’’
-అడివి శేష్

‘‘విజిల్స్ కొట్టే మూమెంట్లు ట్రైలర్లో చాలా ఉన్నాయి. అందరికీ ఆల్ ద బెస్ట్’’
-సాయిధరమ్ తేజ్

‘‘ఇది కేవలం ట్రైలర్ కాదు. ఇదొక మాస్టర్ పీస్. మాటలు రావట్లేదు. ఇండియన్ సినిమా కోసం రాజమౌళి చేస్తున్న సేవలకు థ్యాంక్స్’’
-రకుల్ ప్రీత్

‘‘పాహిమాం.. పాహిమాం.. దర్శకధీరుని తపనకు నా సాష్టాంగ నమస్కారం’’
-హరీష్ శంకర్

‘‘వావ్.. మీరు మా అంచనాల్ని మరింత పెంచేసి.. ‘ఇక ఆగలేం’ అనే మోడ్ లోకి మమ్మల్ని తీసుకెళ్లిపోయారు. జై మహిష్మతి’’
-దేవిశ్రీ ప్రసాద్

‘‘ఔట్ స్టాండింగ్ ట్రైలర్. ప్రతి ఫ్రేమ్ ఎన్నో విషయాలు చెబుతోంది. రాజమౌళి తన నెక్స్ట్ బెస్ట్ అందిస్తున్నాడు. టీంలో అందరికీ ఆల్ ద బెస్ట్’’
-పి.సి.శ్రీరాం

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/