Begin typing your search above and press return to search.

దసరా కలెక్షన్ల టెన్షన్... రంగంలోకి సెలబ్రిటీలు?

By:  Tupaki Desk   |   3 April 2023 11:44 PM IST
దసరా కలెక్షన్ల టెన్షన్... రంగంలోకి సెలబ్రిటీలు?
X
నాని మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీగా వచ్చిన దసరా సినిమాకి మిక్స్డ్ టాక్ లభించింది. కొంతమంది ఈ సినిమా అద్భుతంగా ఉందని కామెంట్ చేస్తుంటే కొంతమంది చూసిన కథేగా అంటూ పెదవి విరుస్తున్నారు. అయితే ఈ సినిమాని నాని కెరియర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.

సుమారు 48 కోట్ల మేర ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. తెలుగు సహా తమిళ కన్నడ మలయాళం హిందీ భాషల్లో కూడా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా తెలుగులో మాత్రమే మంచి పర్ఫామెన్స్ సాధిస్తోంది.

అది కూడా మొదటి రోజు దాదాపు 13 కోట్ల వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేస్తే రెండో రోజు ఐదు కోట్లకు పడిపోయింది. ఆ తర్వాత కూడా వసూళ్లు అంతంత మాత్రమే ఉన్నాయి. ఈ కలెక్షన్స్ వ్యవహారంలో ఇబ్బందులు పడుతున్నట్టు గుర్తించిన సినిమా యూనిట్ వెంటనే సెలబ్రిటీల చేత ట్వీట్లు వేయిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ముందుగా మహేష్ బాబు తర్వాత ప్రభాస్ ఇప్పుడు రాజమౌళి ఈ సినిమా అత్యద్భుతంగా ఉంది కచ్చితంగా చూసి తీరాల్సిన సినిమా అంటూ ట్వీట్లు చేయడం హార్ట్ టాపిక్ అవుతుంది. వాస్తవానికి ఇదే తెలంగాణ నేపథ్యంలో జరిగే ఎక్కిన బలగం లాంటి చిన్న సినిమాకి ఎలాంటి సెలబ్రిటీ ట్వీట్లు అవసరపడలేదు.

కేవలం మౌత్ టాక్ ద్వారానే ఇప్పటికీ అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యాక కూడా సినిమాకి వసూళ్ల వర్షం కురుస్తోంది. అయితే దసరా సినిమాలో కంటెంట్ ఉన్నా సరే ప్రేక్షకులను మరింత ఎంగేజ్ చేయాలని కలెక్షన్స్ మరింత పెంచాలని ఉద్దేశంతో సినిమా యూనిట్ ఈ మేరకు సెలబ్రిటీగా చేత ట్వీట్లు వేయిస్తుంది అనే ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది.

ఈ సినిమాలో నానీ సరసన కీర్తి సురేష్ నటించిన ఇతర కీలక పాత్రలలో కన్నడ సినీ పరిశ్రమకు చెందిన దీక్షిత్ శెట్టి అనగల సినీ పరిశ్రమకు చెందిన షైన్ ఛామ్ టాకో వంటి వారు నటించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.