Begin typing your search above and press return to search.

అమ్మాయిలతో చాట్ చేయాలంటే వణుకే

By:  Tupaki Desk   |   11 April 2018 10:09 AM IST
అమ్మాయిలతో చాట్ చేయాలంటే వణుకే
X

టాలీవుడ్ నటి శ్రీరెడ్డి ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనం అయిపోతోంది. పలు నేషనల్ ఛానల్స్ కూడా శ్రీరెడ్డి దర్శనం ఇచ్చేస్తోంది. రోడ్డు మీద అర్ధ నగ్న ప్రదర్శన చేయడం ఇందుకు కారణం కాగా.. ఇండియన్ ఐడల్ శ్రీరామ్.. వైవా హర్ష లాంటి వారితో తాను చేసిన వాట్సాప్ ఛాట్ లను స్క్రీన్ షాట్స్ గా మలిచి నెట్ లో పెట్టేసింది శ్రీరెడ్డి.

ఇలా రికార్డెడ్ గా దొరికిపోవడం సెలబ్రిటీలకే కాదు.. సామాన్యులకు అయినా ఇబ్బంది కలిగించే విషయమే. ముఖ్యంగా ఇలాంటి ఆలోచనలు ఉన్న వారిలో ఇప్పుడు వణుకు మొదలైంది. మనసులో వేరే ఆలోచనలతో అమ్మాయిలతో ఛాట్ చేసేందుకు భయపడాల్సి వస్తోంది. గతంలో జనాలు స్నాప్ ఛాట్ లో ఛాట్ చేసినా.. అప్పటికప్పుడు హిస్టరీ క్లియర్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ వాట్సాప్ లాంటి ఇప్పుడు అందుబాటులో ఉన్న ఛాటింగ్ యాప్స్ లో ఇలాంటివి సాధ్యం కాదు. ఈ మధ్యన మెసేజ్ డిలెట్ లాంటి ఆప్షన్స్ ఇచ్చినా.. అసలంటూ ముందు ఛాటింగ్ చేసిన తర్వాత అవతలివాళ్లకు స్క్రీన్ షాట్స్ తీసుకునే ఆప్షన్ ఉంటుంది.

పైగా ఈ ఉదంతం బైటకు రాకముందు చేసిన ఛాటింగులు.. వాటిలో వాగిన వాగుళ్లు.. గుర్తొచ్చి చాలా మంది తెగ వణుకుతున్నారట. అందుకే ఈ టాపిక్ మీద చాలామంది రియాక్ట్ కాలేకపోతున్నారని.. ఏదైనా మాట్లాడితే 'మరి నాతో నువ్వు చేసిన ఈ ఛాట్ సంగతేంటి' అంటూ మరొకరు ముందుకొస్తే ఈ వివాదంలో తాము కూడా భాగం కావాల్సి ఉంటుందని భయపడుతున్నట్లు తెలుస్తోంది.