Begin typing your search above and press return to search.
టాలీవుడ్ లో విషాదం..ఎవరూ రావద్దంటా.!
By: Tupaki Desk | 8 April 2020 1:40 PM ISTకరోనా ఎఫెక్ట్ తో మనిషి చనిపోయినా కూడా పలకించేందుకు.. పరామర్శించేందుకు.. కడసారి చూసేందుకు వెళ్లలేని దైన్యం ప్రస్తుతం నెలకొంది. తాజాగా టాలీవుడ్ లోనూ ఇదే విషాదం నెలకొంది.
టాలీవుడ్ లో తాజాగా సోమవారం రెండు విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. వారి బంధువులు - సినీ సెలెబ్రెటీలు కనీసం వారిని పలకరించడానికి వీల్లేకుండా కరోనా భయం ఉంది. వారు కూడా తమ దగ్గరకు ఎవరూ రావద్దు ప్లీజ్ అంటూ ఇంట్లోనే ఉండండి.. ఫోన్ లో పరామర్శించండి అని వేడుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.
ప్రముఖ తెలుగు యాంకర్ సుమ - ఆమె భర్త - నటుడు రాజీవ్ కనుకాల కుటుంబంలో విషాదం అలుముకుంది. గత ఏడాదే తండ్రి - తల్లిని పోగొట్టుకున్న రాజీవ్ కనకాల.. తాజాగా తన సోదరి శ్రీలక్ష్మీని కూడా కోల్పోయాడు. గత కొద్దికాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె ఏప్రిల్ 6న రెండు రోజుల క్రితం చనిపోయింది. ఇలాంటి కష్టకాలంలో సుమ - రాజీవ్ ను పరామర్శించేందుకు సినీ పెద్దలు - నటులు రావాలని అనుకున్నారు. అయితే కరోనా భయంతో వారు రాలేక ఫోన్ లోనే పరామర్శించారు.
ఇక దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కూడా తాజాగా మరణించారు. ఆయనకు పలువురు సంతాపం తెలిపారు. చిరంజీవి - ఇతర సినీ ప్రముఖులు ఫోన్లోనే పరామర్శించడం గమనార్హం.
తాజాగా రెండు కుటుంబాల్లో విషాదం తెలిసి సినీ అభిమానులు - ప్రముఖులు పరామర్శించడానికి రావద్దని తమ్మారెడ్డి - సుమ-రాజీవ్ ఫ్యామిలీ పిలుపునివ్వడం విశేషం. ప్లీజ్ దయచేసి రావద్దని.. మా విషాదం మీ ఇంట్లోకి మరో విషాదాన్ని కరోనాతో తీసుకెళ్లొద్దు.. బయటకు రాకండి అంటూ ఆడియో రూపంలో రిక్వెస్ట్ చేశారు. కరోనా ప్రబలుతున్న వేళ ఇలా సామూహిక పరామర్శలు - అంత్యక్రియలకు హాజరు కావద్దని వారు పిలుపునిచ్చారు.