Begin typing your search above and press return to search.

హ్యాపీ హోలీ అనేసిన మన స్టార్లు

By:  Tupaki Desk   |   2 March 2018 11:29 AM GMT
హ్యాపీ హోలీ అనేసిన మన స్టార్లు
X
హోలీ వ‌చ్చిందంటే చాలు... తారాలోకం రంగుల్లో త‌డిసి ముద్ద‌యిపోతుంది. నిజంగా రంగులు పూసుకున్నా లేకున్నా... హ్యాపీ హోలీ అంటూ ఫోటోలు సిద్దమైపోతాయ్‌.... ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంటాయ్‌. కొంత మంది హోలీ రోజు ఎంచ‌క్కా రంగుల‌తో ఆడుతుంటే... మ‌రికొంద‌రు న‌టులు మాత్రం... ఆ రోజు త‌మ సినిమా పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేస్తూ బిజీగా ఉన్నారు.

మ‌న సినిమా వాళ్లు ఏ పండుగ‌ను వ‌ద‌ల‌రు... దేనినైనా త‌మ సినిమా ప్ర‌మోష‌న్ కి వాడేసుకుంటారు. ఇదిగో ఇప్పుడు హోలీ కూడా అంతే. రామ్ చ‌ర‌ణ్‌... మంచు ల‌క్ష్మి... శ్రీముఖి... నారా రోహిత్‌ వంటి స్టార్లు హోలీ రోజు రంగుల వెల్లువ‌తో అభిమానుల‌కు శుభాకాంక్ష‌లు చెప్పారు. కానీ బెల్లం కొండ శ్రీనివాస్‌.. నిఖిల్‌... నితిన్ వంటి స్టార్లు మాత్రం త‌మ సినిమాల ప్ర‌మోష‌న్‌కు హోలీని ఉప‌యోగించుకున్నారు. హోలీ రోజున అన్ని రంగులు క‌ల‌గ‌ల‌పిన క‌ల‌ర్ ఫుల్ పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేశారు. నిఖిల్ ప్ర‌స్తుతం కిరాక్ పార్టీ సినిమా న‌టిస్తున్నాడు... నితిన్ ఛ‌ల్ మోహ‌న్ రంగా సినిమా విడుద‌ల కోసం ఎదురు చూస్తున్నాడు. అందుకే హోలీ రోజున ఆ సినిమా పోస్ట‌ర్ విడుద‌ల చేశాడు. బెల్లం కొండ శ్రీనివాస్ సినిమా శుక్ర‌వార‌మే ప్రారంభ‌మ‌వుతున్న సంద‌ర్భంగా... ఆ పోస్ట‌ర్ ను ఆ చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. నాని కృష్ణార్జున యుద్ధం టీం హోలీ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది మొత్త‌మ్మీద హోలీని ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వాళ్లు వాడేసుకుంటున్నారు.

కిరాక్ పార్టీ పోస్ట‌ర్ ను బ‌ట్టి చూస్తే... సినిమాలో హోలీ సీన్ ఉన్న‌ట్టుగా క‌నిపిస్తోంది. క‌నుక వాళ్లు ఎంచ‌క్కా ఈ పండుగ‌కు ఆ సీన్‌తో పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. నిజానికి టాలీవుడ్... బాలీవుడ్‌ల‌లో హోలీ సంబ‌రాలు జ‌ర‌గ‌డం లేద‌నే చెప్పాలి. శ్రీదేవి మ‌ర‌ణంతో వారంతా రంగుల పండుగ‌ను చేసుకోకూడ‌ద‌ని అనుకున్న‌ట్టుగా క‌నిపిస్తోంది.