Begin typing your search above and press return to search.

రేప్‌ కేసుపై స్పందించిన స్టార్‌ సెలబ్రెటీ

By:  Tupaki Desk   |   17 July 2021 5:44 AM GMT
రేప్‌ కేసుపై స్పందించిన స్టార్‌ సెలబ్రెటీ
X
బాలీవుడ్‌ స్టార్‌ నిర్మాత.. టీ సిరీస్ సంస్థ అధినేత భూషన్‌ కుమార్‌ తనను మోసం చేశాడు అని.. సినిమాల్లో ఆఫర్లు ఇప్పటిస్తానంటూ అత్యాచారం చేశాడంటూ 30 ఏళ్ల మహిళ పోలీసులను ఆశ్రయించింది. కాస్టింగ్‌ కౌచ్‌ విషయమై మళ్లీ బాలీవుడ్‌ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో భూషన్ కుమార్‌ స్పందించాడు. తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశాడు. ఆమె చెప్తున్నవన్నీ కూడా అవాస్తవాలే అంటూ భూషన్‌ కుమార్‌ చెబుతున్నారు. ఆమె గతంలో తమ సంస్థలో పని చేసిందని.. ఆమె దొంగతనం చేసిన కారణంగా కేసు పెట్టామని.. అందుకే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నట్లుగా ఆరోపించింది. ఆమె దొంగతనంకు పాల్పడ్డట్లుగా తమ వద్ద సాక్ష్యం కూడా ఉందని ఆయన చెప్పుకొచ్చాడు.

గతంలో ఆమెపై కేసు పెట్టినందుకు గాను ఇప్పుడు ఆరోపణలు చేస్తోంది అంటూ ఆయన వ్యాఖ్యలు చేశాడు. ఆమె చేసిన ఆరోపణలపై ఫిర్యాదు చేయబోతున్నట్లుగా పేర్కొన్నాడు. ఆమె పై పరువు నష్టం దావా వేయబోతున్నట్లుగా భూషన్‌ కుమార్‌ పేర్కొన్నాడు. దొంగతనం కేసు పెట్టినందుకు తమ అధినేత పై ఆమె ఆరోపణలు చేస్తున్నందుకు గాను ఆమె పై కేసు పెట్టేందుకు కూడా సిద్దం అవుతున్నట్లుగా సంస్థ ప్రతినిధులు కూడా పేర్కొన్నారు. జులై 1న అంబోలీ పోలీస్ స్టేషన్‌ లో ఆమెపై ఫిర్యాదు చేశామని.. ఆమె దొంగతనం చేసినట్లుగా పక్కా సాక్ష్యాలు ఉన్నాయి. అందుకే ఆమెపై చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యామనే ఉద్దేశ్యంతో తమ సంస్థ పై ఆరోపణలు చేస్తూ తమ అధినేత భూషన్ కుమార్‌ పై ఆమె ఆరోపణలు మొదలు పెట్టిందంటూ సంస్థ ప్రతినిధులు ఆమెపై మళ్లీ కేసు పెట్టేందుకు సిద్దం అయ్యారట.

బాలీవుడ్‌ వర్గాల వారు కూడా కొందరు భూషన్‌ కుమార్‌ కు మద్దతుగా నిలుస్తున్నారు. ఆయన పై సదరు మహిళ చేస్తున్న ఆరోపణలు కక్ష పూరితమైనవిగా ఆయన గురించి తెలిసిన వారు అంటున్నారు. భూషన్ కుమార్‌ గురించి ఆమె ఇలాంటి ఆరోపణలు చేయడం విచారం అంటున్నారు. బాలీవుడ్ లో మంచి పేరున్న భూషన్‌ కుమార్‌ పై ఇలాంటి ఆరోపణలు చేసి ఆయన యొక్క పేరును చెడగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారి ఆరోపణలు ఇండస్ట్రీ వర్గాల వారిపై చెడు అభిప్రాయం కలిగేలా చేస్తుందని కొందరు అంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌ లో బడా చిత్రాలను నిర్మిస్తూ టీసిరీస్ అధినేతగా ఎన్నో సినిమాలను అందిస్తున్న ఆయన పై ఇలాంటి ఆరోపణలు చేయడం ను సంస్థ ప్రతినిధులు ఖండిస్తున్నారు.

ఆమె చేసిన ఆరోపణలను కోర్టులోనే ఎదుర్కొంటానంటూ భూషన్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్‌ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. మరి కొందరు మాత్రం ఈ విషయమై భూషన్‌ కుమార్‌ పై విమర్శలు చేస్తున్నారు. ముందు ముందు ఈ వివాదం ఎక్కడకు వెళ్తుందో అంటూ బాలీవుడ్‌ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూషన్‌ కుమార్‌ కు బాలీవుడ్‌ వర్గాల వారు మద్దతు గా నిలవాలంటూ కొందరు పిలుపునిస్తున్నారు.