Begin typing your search above and press return to search.

ఎవ్వ‌ర్ గ్రీన్ అంద‌గాడు అంటూ మ‌హేష్ పై చిరు-కేటీఆర్ ట్వీట్లు

By:  Tupaki Desk   |   9 Aug 2021 8:40 AM GMT
ఎవ్వ‌ర్ గ్రీన్ అంద‌గాడు అంటూ మ‌హేష్ పై చిరు-కేటీఆర్ ట్వీట్లు
X
సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు సినీరాజ‌కీయ రంగ సెల‌బ్రిటీలు శుభాకాంక్ష‌లు తెలిపారు. ట్విట్ట‌ర్ లో ట్వీట్ల‌తో హోరెత్తిపోతోంది. రాజ‌కీయ ప్ర‌ముఖుడు మంత్రి కేటీఆర్ స‌హా  స‌ర్కార్ వారి పాట ద‌ర్శ‌కుడు పరశురామ్ పెట్ల- హరీష్ శంకర్- అనీల్ రావిపూడి- శ్రీను వైట్ల- గోపీచంద్ మలినేని- సురేందర్ రెడ్డి- మెహెర్ రమేష్- వెంకీ కుడుముల త‌దిత‌రులు సామాజిక మాధ్య‌మాల్లో శుభాకాంక్ష‌లు తెలిపారు.

స్టార్ల‌లో మెగాస్టార్ చిరంజీవి- విక్టరీ వెంకటేష్- జూనియర్ ఎన్టీఆర్- సుశాంత్- సందీప్ కిషన్- నారా రోహిత్ - వెన్నెల కిషోర్- అడివి శేష్- అల్లరి నరేష్- సుధీర్ బాబు-రామ్ పోతినేని- సాయి ధరమ్ తేజ్- నవీన్ పోలిశెట్టి- సత్యదేవ్ తదిత‌రులు శుభాకాంక్ష‌లు తెలిపారు. మ‌హేష్ పీఆర్వో దివంగ‌త బీఏ రాజు కుమారుడు అప్ కం ద‌ర్శ‌కుడు బి.శివ‌కుమార్ మ‌హేష్ కి ప్ర‌త్యేకించి శుభాకాంక్ష‌లు తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్ మీడియాల్లో మ‌హేష్ కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఎవర్ గ్రీన్ అందగాడు సూపర్ స్టార్ మహేష్ అంటూ ఇండ‌స్ట్రీ బాస్ ప్ర‌శంస‌లు కురిపించారు. స్టైల్ అండ్ టాలెంట్ మేళ‌వించిన ఆయుధం లాంటి నటుడు బ్లాక్ బస్టర్ చిత్రాలతో దూసుకెళ్లాలి. మ‌రిన్ని పుట్టిన‌రోజులు జ‌రుపుకోవాల‌ని చిరు బ్లెస్ చేశారు. ఇక మంత్రి కేటీఆర్ ``వన్నెతరగని అందగాడు మహేష్`` అంటూ పొగిడేశారు. నాకు తెలిసిన మంచి సూపర్ స్టార్ కు హ్యాపీ బర్త్ డే. మ‌రెన్నో పుట్టిన‌రోజులు జ‌రుపుకోవాలి అని కేటీఆర్ ఆకాంక్షించారు.

నేటి ఉద‌యం మ‌హేష్ బ‌ర్త్  డే సంద‌ర్భంగా స‌ర్కార్ వారి పాట టీజ‌ర్ రిలీజ్ కాగా అంత‌ర్జాలంలో జెట్ స్పీడ్ తో వైర‌ల్ అవుతోంద‌ది. SSMB28 నిర్మాత నాగవంశీ ట్వీట్ చేస్తూ.. ``మా సూపర్‌స్టార్ మహేష్ బాబుకు పుట్టిన‌రోజు శుభాకాంక్షలు. మీతో ప్ర‌యాణం చాలా హ్యాపీగా ఉంది. హారిక హాసిని బ్యాన‌ర్ లో రూపొందుతున్న #SSMB28 సినిమాకు సంబంధించిన వివరాలను ఆగస్టు 9వ  4 పీఎం తెలియజేస్తాం అంటూ ట్వీట్ చేశారు.

1-నేనొక్క‌డినే చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందించిన జాతీయ అవార్డు గ్ర‌హీత రత్నవేలు ట్వీట్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. మై డియర్ మహేష్ బాబుకు హ్యాపీయెస్ట్ బర్త్ డే విషెస్. ఈ ఏడాది మీకు మంచి విజయాలు ద‌క్కాలి అని అన్నారు.

సూపర్ స్టార్ దిష్ఠి తీసుకోవాలి అంటూ యువ హీరో నవీన్ పోలిశెట్టి ట్వీట్ చేసారు. జాతిరత్నాలు సినిమాను చూసి మీరు కురిపించిన ప్రశంస నాకు ఈ సంవత్సరంలో మరుపురాని విషయం. మీ ప్రశంసతో ఇంకా మంచి సినిమాలు చేయాలనే స్పూర్తిని కలిగించారు అంటూ ఆనందం వ్య‌క్తం చేశారు న‌వీన్. మ‌హేష్ - పరశురాం కాంబినేషన్ లో స‌ర్కార్ వారి పాట‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అంటూ ద‌ర్శ‌కుడు బాబి స్పందించారు. మీ `సర్కారు వారి పాట` సినిమా టీజర్ అదిరిపోయింది అంటూ హీరో రామ్ ట్వీట్ చేశారు. బిగ్‌బాస్ తెలుగు 2 విజేత కౌశల్ మండా మహేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మ‌హేష్ ప్రోత్సాహం వ‌ల్ల‌నే త‌న ప్ర‌యాణం సాగింద‌ని కౌశ‌ల్ అన్నారు.

వన్ అండ్ ఓన్లీ ఒక్కడు మహేష్ బాబుగారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ నీలిమ గుణ విషెస్ తెలిపారు. వెండితెరపైనే కాదు నిజ‌ జీవితంలోనూ మీరు నాకు స్పూర్తి. నా అమేజింగ్ సహ నటుడు అందగాడైన మ‌హేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ కీర్తి సురేష్ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు.