Begin typing your search above and press return to search.

సెల‌బ్రిటీల‌కు కామ‌ధేనువులా డిజిట‌ల్ ఆదాయం

By:  Tupaki Desk   |   31 March 2021 8:00 AM IST
సెల‌బ్రిటీల‌కు కామ‌ధేనువులా డిజిట‌ల్ ఆదాయం
X
లైఫ్ అంతా డిజిట‌ల్ మ‌యం అయిపోయింది. ఈ వేదిక స‌రికొత్త ఆదాయ మార్గాల‌కు ఆయువుగా మారింది. ఇక్క‌డ ఎన్ని లైక్ లు వ‌స్తే.. ఎన్ని క్లిక్ లు వ‌స్తే అంత‌గా ఆదాయం. టాలీవుడ్ బాలీవుడ్ సెల‌బ్రిటీలే కాదు.. టాప్ మోడ‌ల్స్ టీవీ న‌టీమ‌ణులు కూడా ఈ వేదిక‌పై భారీ ఆదాయ ఆర్జ‌న చేస్తున్నారు.

ముఖ్యంగా వీడియో షేరింగ్ వేదిక‌ ఇన్ స్టాగ్ర‌మ్ లో నిరంత‌రం ఫోటోలు వీడియోల్ని షేర్ చేస్తూ ఈ వేదిక‌పై భారీ గా ఆర్జిస్తున్న సెల‌బ్రిటీలెంద‌రో ఉన్నారు. ఇక్క‌డ లైక్ లు హిట్లు అంటూ వ్యూస్ ఇంపార్టెంట్. పెద్ద స్టార్ల నుంచి చిన్న సెల‌బ్రిటీలు కూడా ఈ వేదిక‌పై బాగానే ఆర్జిస్తున్నారన్న‌ది ఓ స‌ర్వే.

ఈ వేదిక‌ల‌పై ప్ర‌తి హిట్లూ రెవెన్యూ తెచ్చి పెట్టేదే. అందుకే వ‌రుస‌గా క్ష‌ణం తీరిక లేకుండా ఫోటోషూట్ల‌ను వీడియో షూట్ల‌ను ఈ వేదిక‌ల‌పై షేర్ చేస్తున్నారు. ఇక ఈ వేదిక‌ల‌పై వేడెక్కించే అందాల భామ‌లు హ‌ద్దులు మీరి ఎక్స్ పోజ్ చేయ‌డం వెన‌క చాలా క‌థే ఉంది. కొంద‌రు భామ‌లు అయితే న్యూడ్ వీడియోల‌తో ఫాలోవ‌ర్స్ ని పెంచుకోవ‌డం చూస్తున్న‌దే.

తొలుత ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్స్ పెరిగాక ఫాలోయింగ్ ని బ‌ట్టి కార్పొరెట్ కంపెనీలు ఆఫ‌ర్లు ఇస్తున్నాయి. ఆ త‌ర్వాత ఇక్క‌డ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్ని పోస్ట్ చేస్తూ ల‌క్ష‌ల్లో ఆర్జిస్తున్నారు. ఈ వేదిక‌ల ద్వారా ప్ర‌క‌ట‌న‌ల ఆదాయంతో పాటు మ‌రోవైపు సినిమా అవ‌కాశాలు ద‌క్కుతున్నాయి. నిజానికి చాలామంది సెల‌బ్రిటీలకు సంబంధించిన పీఆర్ యాక్టివిటీస్ అన్నీ ఇన్ స్టా వేదిక‌గానే సాగిపోతుండ‌డం కూడా ఆస‌క్తిక‌రం. ఇక పెద్ద స్టార్లు అయితే ఇన్ స్టా ప్ర‌మోష‌న్ ని కూడా క‌లిపేసి వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌కు భారీ కాంట్రాక్టులు కుదుర్చుకుంటున్నార‌ని తెలిసింది. ఈరోజుల్లో ఇన్ స్టా- డిజిట‌ల్ మాధ్య‌మం ఆదాయం ప‌రంగా కామ‌ధేనువు అని చెప్పాలి.