Begin typing your search above and press return to search.
స్పెషల్ మాస్కులతో ప్రత్యేకతను చాటుకుంటున్న సెలబ్రిటీలు..!
By: Tupaki Desk | 8 Dec 2020 8:49 AM ISTకోవిడ్-19 నేపథ్యంలో మహమ్మారి నుండి జాగ్రత్త పడటానికి మాస్కులు అనేవి ప్రతి ఒక్కరికి కచ్చితంగా అవసరం అవుతున్నాయి. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే మాస్క్ ధరించే వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రక్షణ కోసం ధరిస్తున్న ఈ మాస్కులను కూడా పలువురు సెలబ్రిటీలు స్పెషల్ గా డిజైన్ చేయించుకుంటున్నారు. ఇంతవరకు ముందు రామ్ చరణ్ ధరించే దుస్తుల నుంచి చెప్పుల వరకు 'మిస్టర్ సి' అనే లోగో ప్రింట్ చేయబడి ఉండటం చూసాం. అలానే చిరంజీవి క్యాప్ మీద 'కేసీ' (కొణిదెల చిరంజీవి అయ్యుండొచ్చు) అని.. అల్లు అర్జున్ దుస్తులపై 'ఏఏ' అనే సిగ్నేచర్ ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ఇప్పుడు మొహాలను కప్పి ఉంచే మాస్కులను కూడా ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. వాళ్ళు ధరించే ట్రెండీ ఔట్ ఫిట్స్ కి తగ్గట్టే మాస్కులను కూడా రెడీ చేయిస్తున్నారు.
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'బాస్' మాస్క్ ధరించి దర్శనమిచ్చాడు. చెల్లెలు నిహారిక పెళ్లి కోసం స్పెషల్ ఫ్లైట్ లో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కి వెళ్లిన చరణ్.. సోషల్ మీడియాలో మాస్క్ ధరించిన ఓ ఫోటో షేర్ చేశాడు. ఇందులో చరణ్ పెట్టుకున్న మాస్క్ పై తన తండ్రి చిరంజీవి లోగో ప్రింట్ చేయబడి ఉంది. అలానే అల్లు అర్జున్ అండ్ టీమ్ ధరించే మాస్కులపై 'ఏఏ' అనే సిగ్నేచర్ డిజైన్ చేయబడి ఉంటుంది. లేటెస్టుగా యువ హీరో అడవి శేష్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలో స్పెషల్ మాస్క్ పెట్టుకుని కనిపించాడు. అకీరా నందన్ తో ఉన్న ఈ పిక్ లో అడవి శేష్ మాస్క్ పై 'ఏఎస్' అనే లోగో కనిపిస్తోంది. ఇక రౌడీ విజయ్ దేవరకొండ మాస్కులపై 'రౌడీ' లోగో ప్రింట్ చేయబడి ఉంటుంది. ఇలా సెలబ్రిటీలు అందరూ కరోనా జాగ్రత్తలతో భాగంగా ధరించే మాస్కులలో కూడా ప్రత్యేకతను చాటుకుంటున్నారు.