Begin typing your search above and press return to search.
గోలీ సోడా అంటున్న సెలబ్రిటీ వారసులు..
By: Tupaki Desk | 29 July 2016 10:06 PM ISTటాలీవుడ్ లో చెప్పుకోదగ్గ నిర్మాతల్లో లగడపాటి శ్రీధర్ కూడా ఒకరు. ఇప్పటికే ఈయన కుమారుడు విక్రమ్ సహిదేవ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేశాడు. స్టార్ హీరోలకు చిన్నప్పటి పాత్రలు చేసిన విక్రమ్ ఆడియన్స్ కు బాగానే నోటీస్ అయ్యాడు. రేసుగుర్రంలో చిన్నప్పటి బన్నీ కేరక్టర్ చేసింది ఇతనే.
ఇప్పడీ విక్రమ్ సహిదేవ్... కన్నడలో లీడ్ రోల్ చేస్తూ ఓ సినిమాలో నటించాడు. కోలీవుడ్ మూవీ గోలీసోడాకు కన్నడ రీమేక్ ఇది. కూలీలుగా పని చేసే నలుగురు కుర్రాళ్ల కథే ఈ చిత్రం. నలుగురిలో ఒకడిగా విక్రమ్ కనిపిస్తాడు. ఈ నలుగురిలో మిగిలిన వాళ్లు కూడా సెలబ్రిటీల పిల్లలే కావడం విశేషం. కన్నడ యాక్టర్ సురాగ్ - సాధు కోకిల కుమారుడు - మరో యాక్టర్ అరుణ్ సాగర్ కుమారుడు నటించారు. ఈ నెల 31న ఆడియో రిలీజ్ కానుండగా.. ఆగస్ట్ 19న సినిమా రిలీజ్ కు రంగం సిద్ధమవుతోంది.
ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు లగడపాటి శ్రీధర్ సిద్ధమవుతున్నారు. తన కుమారుడిని తెలుగులో అరంగేట్రం చేయించండతో పాటే.. మరి కొందరు సెలబ్రిటీల పిల్లలతో ఈ గోలీసోడా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.