Begin typing your search above and press return to search.

ఇన్ స్టాతోనూ సెలబ్రెటీలకు ఎంత ఆదాయమో తెలుసా?

By:  Tupaki Desk   |   3 Sept 2021 6:00 AM IST
ఇన్ స్టాతోనూ సెలబ్రెటీలకు ఎంత ఆదాయమో తెలుసా?
X
ప్రకటనలు కొత్తదారి పడుతున్నాయి. పత్రికలు, టీవీ చానెల్స్ లో కంటే సోషల్ మీడియాలో ఎక్కువ బిజినెస్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న సినీ, క్రీడా ప్రముఖులు ఇప్పుడు ప్రకటనల ద్వారా లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. ఈ ఫాట్ ఫాంపై బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ ప్రతి పోస్ట్ నుంచి చాలా సంపాదిస్తుంటారు. అయితే అవి పెయిడ్ కంటెంట్ అని మాత్రం చెప్పడానికి సంకోచిస్తుంటారు.

అయితే ఏఎస్.సీ.ఐ మార్గదర్శకాలను అనుసరించి చాలా మంది ప్రముఖులు తమ పోస్ట్ లపై ‘పెయిడ్ ప్రమోషన్’ లేదా ప్రకటన అంటూ ట్యాగ్ తో పోస్టులు చేస్తున్నారు. జూన్ 14, 2021 నుంచి అమల్లోకి వచ్చే అడ్వర్టైజింగ్ స్టాండర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్.సీఐ) మార్గదర్శకాల ప్రకారం.. డబ్బు లేదా ఏదైనా ఇతర లావాదేవీల పరంగా జరిగే ప్రమోషనల్ పోస్టులకు ఖచ్చితంగా పెయిడ్ ప్రమోషన్ లేదా ప్రకటన అంటూ ట్యాగ్ ను ఉంచాలని పేర్కొంటున్నారు.

ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ పోస్టుల నుంచి అత్యధికంగా సంపాదిస్తున్న టాప్ 30 గ్లోబల్ సెలబ్రెటీల జాబితాను హాప్పర్స్ విడుదల చేసింది. ఇందులో భారత్ నుంచి విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే 19వ స్థానంలో నిలిచాడు. ఆటలోనే కాదు.. ఆర్జనలో కూడా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సత్తా చాటుతున్నాడు. ఈ లాక్ డౌన్ కాలంలో ఇన్ స్టాగ్రామ్ లో స్పాన్సర్డ్ పోస్టుల ద్వారా అత్యధికంగా ఆర్జించిన ఏకైక క్రికెటర్ గా నిలిచాడు.

సేకరించిన డేటా ప్రకారం.. విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే ఇన్ స్టా గ్రామ్ ద్వారా సంపాదనలో ఏకంగా 6వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ ప్రతి పోస్ట్ కు దాదాపు రూ.5 కోట్లు సంపాదిస్తున్నాడు. ఈ లాక్ డౌన్ కాలంలో స్పాన్సర్డ్ పోస్టుల ద్వారా భారీగా సంపాదించాడు. ఇక కోహ్లీ తరువాత ప్రియాంక చోప్రా ఈ జాబితాలో 27వ స్థానంలో ఉన్నాడు. ఆమె ప్రతి పోస్ట్ నుంచి రూ.3 కోట్లు సంపాదిస్తోంది.

ఈ ఇన్ స్టాగ్రామ్ సంపాదనలో పోర్చుగల్ ఫుట్ బాలర్ క్రిస్టియానో రోనాల్డో రూ.17కోట్ల 24లక్షలతో టాప్ లో కొనసాగుతున్నాడు. అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ (రూ.11.50 కోట్లు), నెయ్ మర్ (రూ.10.53 కోట్లు) రెండు మూడు స్థానాల్లో ఉన్నారు.

ఇక ఫుట్ బాల్ లో తొలి బిలియనీర్ గా క్రిస్టియానో రొనాల్డో అవతరించాడు. టీమ్ స్పోర్ట్స్ లో ఈ ఘనత సాధించిన తొలి ఫుట్ బాలర్ గా రికార్డులెక్కాడు. గత ఏడాదిలో రొనాల్డో సంపాదన రూ.793 కోట్లు. బిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిన మూడో ఆటగాడు ఇతడు...

ఇటీవల కోహ్లీ ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయాన్ని ఆమోదిస్తూ పోస్ట్ చేశఆడు. కానీ దానికి పెయిడ్ పోస్ట్ అనే ట్యాగ్ లేదు. దీంతో విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేయబడ్డాడు. దీంతో ఏఎస్.సీఐ నోటీసు పంపింది. ఆ తర్వాత విరాట్ పోస్టును ఎడిట్ చేసి ‘పెయిడ్ పోస్ట్’ అని ట్యాగ్ ను పెట్టాడు.