Begin typing your search above and press return to search.
వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టాలీవుడ్ ప్రముఖులు...!
By: Tupaki Desk | 7 May 2020 4:20 PM ISTవైజాగ్ నగరంతో సినీ ఇండస్ట్రీకి ఎంతో అనుబంధం ఉంది. సముద్ర తీరాన ఉండే ఈ నగరంలో షూటింగ్ అనుకూలంగా ఉంటుందని అందరూ భావిస్తుంటారు. అంతేకాకుండా అక్కడ ఉండే అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకోడానికి ఇంటరెస్ట్ చూపిస్తూ ఉంటారు. సాగర తీరాన వెలసిన వైజాగ్ నగరంలో ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు నివాసం ఏర్పరచుకొని ఉన్నారు. అయితే ఈ రోజు సంభవించిన దుర్ఘటనతో టాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్.ఆర్ వెంకటాపురంలోని ఎల్.జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకై భారీ ప్రమాదం జరిగింది. పరిశ్రమ నుంచి లీక్ అయిన రసాయన వాయువు 3 కి.మీల మేర వ్యాపించి ఊపిరి ఆడకుండా చేసింది. దీనితో కొందరు ప్రాణాలు కోల్పోగా వందల సంఖ్యలో ఆసుపత్రి పాలయ్యారు. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై టాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాని, కళ్యాణ్ రామ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, మారుతి, అనిల్ రావిపూడి, తమన్నా మొదలైన వారు ట్విట్టర్ వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు వారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదంలో అస్వస్థతకు లోనైనవారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. చికిత్స తీసుకుంటున్న వారికి మంచి వైద్యం అందించాలని వారు అధికారులను అభ్యర్ధించారు. అలాగే వైజాగ్ సిటీతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని.. అలాంటి నగరానికి ఇలా కావడం కలచివేసిందన్నారు.
చిరంజీవి ట్వీట్ చేస్తూ.. విశాఖలో విషవాయువు భారీన పడి ప్రజలు మరణించడం మనసును కలచివేసిందని చెప్పారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అస్వస్థతకు గురైన వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. లాక్ డౌన్ తరువాత ఓపెన్ చేసే ఫ్యాక్టరీలలో సంబంధిత అధికారులు ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలానే మహేష్ బాబు ఈ ఘటనపై స్పందిస్తూ.. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన చాలా బాధాకరమని.. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విశాఖ గ్యాస్ లీకేజీ గురించి తెలిసి షాక్ కు గురయ్యాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అస్వస్థతకు గురైన వారు త్వరలో కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా ఈ ఘటన గురించి స్పందించారు. ఈరోజు గ్యాస్ లీక్ లాంటి భయంకరమైన వార్త విని మేల్కొన్నానని చెప్పారు. మృతి చెందిన వారికి సంతాపం తెలపడంతో పాటు బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. మరికొంతమంది టాలీవుడ్ ప్రముఖులు ఈ ఘటనపై స్పందిస్తూ అలాగే వైజాగ్ సిటీతో తనకు ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.