Begin typing your search above and press return to search.

బుట్ట బొమ్మ ల‌వ్ లో పాపం పసోడు

By:  Tupaki Desk   |   1 Jun 2020 3:45 AM GMT
బుట్ట బొమ్మ ల‌వ్ లో పాపం పసోడు
X
బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే ప్రేమ‌లో త‌రిస్తున్న ఆ కుర్రాడు ఎవ‌రు? ఎవ‌రై ఉంటారు? అంటే మ‌రీ అంత కంగారు ప‌డొద్దు. అయినా బుట్ట‌బొమ్మ‌తో ప్రేమ‌లో ప‌డ‌నిది ఎవ‌రు? అంద‌రిలానే ఆ బుడ‌త‌డు కూడా నిండా ప్రేమ‌లో మునిగాడ‌ట‌. ఈ విష‌యాన్ని స‌ద‌రు కుర్రాడి త‌ల్లిగారు స్వ‌యంగా చెప్పారు లెండి..

ఇంత‌కీ విష‌య‌మేమిటా? అన్న‌ది ఆరా తీస్తే.. అస‌లు సంగ‌తి తెలిసింది. అల్లు అర్జున్ - పూజా హెగ్డే జంట‌గా న‌టించిన `అల వైకుంఠపుర‌ములో` రికార్డ్ బ్రేకింగ్ హిట్ చిత్రంగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లి కాలంలో చార్ట్ బ‌స్ట‌ర్ లిరిక్స్ తో మ్యూజిక‌ల్ హిట్ గా నిలిచిన చిత్రంగానూ అల వైకుంఠ‌పుర‌ములో గురించి చెప్పుకున్నారు. ఈ సినిమాలో ప్ర‌తి పాటా దేనిక‌దే ప్ర‌త్యేకం. ముఖ్యంగా బుట్ట బొమ్మ సాంగ్ కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంగీత ప్రియులు ఫిదా అయిపోయారు. ఆ పాట‌కు ఎన్నో అనుకర‌ణ‌లు అంత‌ర్జాలాన్ని వేడెక్కించాయి.

ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ ఇటీవ‌ల బుట్ట‌బొమ్మ‌కు ఫిదా అయ్యి స్టెప్పులేసిన సంగ‌తి తెలిసిందే. ఎంద‌రో సెల‌బ్రిటీలు ఈ ట్యూన్ కి మైమ‌రిచి నాట్య‌మాడారు. ఆ వీడియోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. అదంతా స‌రే కానీ.. తాజాగా ఈ బుట్ట‌బొమ్మ‌కు మైమ‌రిచిన ఓ బేబి బోయ్ గురించి ప్ర‌ముఖ నిర్మాత .. బాలాజీ టెలీఫిలింస్ అధినేత్రి ఏక్తా క‌పూర్ స్వ‌యంగా చెప్పిన మాట ఆస‌క్తిని రేకెత్తించింది.

బాలీవుడ్ నిర్మాత కమ్ డైరెక్టర్ ఏక్తా కపూర్ కుమారుడు రవీ కపూర్ బుట్ట బొమ్మ పాట‌కు వీరాభిమాని అయిపోయాడ‌ట‌. తన కుమారుడు బుట్ట బొమ్మ పాట‌ను టెలివిజన్ ‌లో వీక్షిస్తూ.. ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న వీడియోను ఏక్తా ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది, ``నా ఫేవరెట్ బాయ్ ఫేవ‌రెట్ సాంగ్! ఇది. సంగీతానికి భాష లేదు !!`` అని చెప్పుకొచ్చింది. అల వైకుంఠపురములో ఆల్బమ్ యూట్యూబ్ ‌లో 1 బిలియన్ వీక్షణలతో సంచ‌ల‌నం సృష్టించింది. బుట్ట బొమ్మ‌ వీడియో సాంగ్ 200 మిలియన్లకు పైగా వీక్షణలతో సెన్సేష‌న్ అయ్యింది.