Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసు: ప్రముఖ నటి ఇంట్లో సోదాలు షురూ

By:  Tupaki Desk   |   4 Sept 2020 12:15 PM IST
డ్రగ్స్ కేసు: ప్రముఖ నటి ఇంట్లో సోదాలు షురూ
X
కర్ణాటకలో శాండిల్ వుడ్ సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.. నిన్న రవిశంకర్ అనే వ్యక్తిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారం ప్రకారం తాజాగా శాండిల్ వుడ్ స్టార్ హీరోయిన్ రాగిణి ద్వివేది ఇంట్లో సోదాలు చేశారు. కోర్టు ద్వారా సెర్చ్ వారెంట్ తీసుకొని మరీ ఆమె ఇంట్లోకి ప్రవేశించి పోలీసులు షాక్ ఇచ్చారు

ఈ సందర్భంగా బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హీరోయిన్ రాగిని ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆమె వాడుతున్న నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని డేటాను సీసీబీ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

ఇప్పటికే నటి అనికాను డ్రగ్స్ సరఫరా చేస్తున్న కేసులో ఎన్సీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. నటి అనికా ఇచ్చిన సమాచారంతో శాండిల్ వుడ్ కు చెందిన కొందరు ప్రముఖులకు డ్రగ్స్ దందాతో సంబంధాలు ఉన్నాయని ఎన్.సీ.బీ , బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ అధికారులు అనుమానిస్తున్నారు.

నటి రాగిని ద్వివేదికి నోటీసులు పంపినా ఆమె విచారణకు హాజరు కాకపోవడంతో ఆమె ఇంటిపై శుక్రవారం దాడులు చేశారు. పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయని.. వివరాలు తరువాత వెల్లడిస్తామని బెంగళూరు జేసీ సందీప్ పాటిల్ తెలిపారు. దీంతో శాండిల్ వుడ్ లో డ్రగ్స్ మాఫియాతో సంబంధం ఉన్న సినీ సెలెబ్రెటీలు వణికిపోతున్నారని తెలుస్తోంది.