Begin typing your search above and press return to search.

అలా పడిపోతున్నావ్ ఏంటి కేథరిన్?

By:  Tupaki Desk   |   10 Dec 2015 4:54 AM GMT
అలా పడిపోతున్నావ్ ఏంటి కేథరిన్?
X
కేథరిన్ థెరిసాని సూపర్ ఫిగర్ అనాలి. ఈ అమ్మడి అందాలను ఇప్పటివరకూ చాలా సినిమాల్లో చూసి తరించారు తెలుగు ప్రేక్షకులు. అసలు ఎంట్రీయే నాని పక్కన పైసా మూవీలో లీడ్ హీరోయిన్ గా చేసింది. తర్వాత బన్నీతో ఇద్దరమ్మాయిలతో చిత్రంలో.. ఇద్దరిలో ఒకరిగా ఓ మెట్టు తగ్గింది.

అంతే, ఆ తగ్గడం తగ్గడం మళ్లీ పైకెక్కేందుకు సరైన అవకాశం దక్కడం లేదు కేథరిన్ కి. మంచు విష్ణు మూవీ ఎర్రబస్సులో లీడ్ హీరోయిన్ కనిపించినా.. మళ్లీ ఈమెను అల్లు అర్జున్ సెకండ్ హీరోయిన్ చేసేశాడు. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బన్నీ చేస్తున్న సరైనోడులో.. ఎమ్మెల్యే పాత్రలో కాస్త డిఫరెంట్ గా కనపించనుండడం ఒక్కటే ఈమెకు ఊరట. ఇప్పుడీ బ్యూటీకో మరో అవకాశం వచ్చింది. నిఖిల్ తో వీఐ ఆనంద్ తీయబోతున్న చిత్రంలో కేథరిన్ ని కన్ఫాం చేశారు. కుర్రాడి పక్కన కదా లీడ్ హీరోయిన్ అవుతుందేమో అనుకునే ఛాన్స్ లేదు.. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమాలో అవికా గోర్ - హీబా పటేల్ లను తీసుకున్నారు. ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్న వాళ్లిద్దరినీ కాదని.. కేథరిన్ కి లీడ్ ఛాన్స్ వచ్చే అవకాశం లేదు. అంటే ఇందులో ఆల్ మోస్ట్ థర్డ్ హీరోయిన్ అనే అనుకోవాలి.

మరి స్టార్ అయ్యేందుకు అన్ని హంగులు ఉన్న ఈ భామ.. లీడ్ హీరోయిన్ స్టేజ్ కి ఎప్పటికి ఎదుగుతుందో? అయినా లీడ్‌ రోల్సులో కెరియర్ స్టార్ట్‌ చేసి.. ఇలా టముకు రోల్స్‌ కు పడిపోతున్నావేందమ్మాయ్‌?