Begin typing your search above and press return to search.
మాస్ మహా రాజాతో చిందులేయనున్న ఎమ్మెల్యే
By: Tupaki Desk | 21 Sept 2020 1:40 PM ISTమాస్ మహారాజ్ రవితేజ రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో రవితేజ డ్యుయల్ రోల్ పోషిస్తున్నారంట. అందుకే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లుగా గత ఏడాది ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టిన నిధి అగర్వాల్, సభా నటేష్ లను ఎంపిక చేశారు. ఇక ఈ సినిమాలో ఒక హుషారైన స్పెషల్ సాంగ్ కూడా ఉందంట. ఈ పాటలో రవితేజకు జోడీగా చిందులేసేందుకు కేథరిన్ థెరిసాను తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నారట. ఇటీవల కేథరిన్ కు తెలుగులో అవకాశాలు రాలేదు. ఆమె ఎక్కువగా తమిళ సినిమాల వైపే ఫోకస్ చేశారు. మళ్లీ రవితేజ తో ప్రత్యేక సాంగ్ తో నైనా మెరిపిస్తుందేమో చూడాలి.
ఇక కొన్నేళ్లుగా రవితేజకు హిట్టు లేదు. కిక్ తర్వాత అంత హిట్టు రవితేజ ఖాతాలో లేదు. మధ్యలో బలుపు హిట్ అయినా మళ్లీ వరుసగా ప్లాప్స్ వచ్చాయి. రాజా ది గ్రేట్ ఓ మాదిరి హిట్ కావడంతో మళ్లీ సక్సెస్ ట్రాక్లోకి వచ్చాడనుకునేలోపే రవితేజ ను వరుసగా మూడు డిజాస్టర్స్ టచ్ చేసి చూడు, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా కుంగదీశాయి. ఇప్పుడు రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ' క్రాక్ ' ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా వేసవిలోనే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. క్రాక్ మూవీతో తనకు మళ్లీ పూర్వవైభవం వస్తుందని రవి తేజ భావిస్తున్నారు. పరిస్థితులన్నీ సద్దుమణిగిన తర్వాత క్రాక్ థియేటర్లలోనే విడుదల కానుంది. రాక్షసుడు రీమేక్ తో హిట్టు కొట్టిన రమేష్ వర్మ రవితేజకు హిట్టు ఇస్తాడేమో చూడాలి.