Begin typing your search above and press return to search.

'మాచర్ల నియోజక వర్గం' లో ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   16 Nov 2021 3:30 PM GMT
మాచర్ల నియోజక వర్గం లో ఎమ్మెల్యే
X
నితిన్ హీరోగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌ గా నటిస్తున్న సినిమా మాచర్ల నియోజక వర్గం. ఈ సినిమాకు ప్రముఖ ఎడిటర్ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్‌ జెట్‌ స్పీడ్ తో సాగుతోంది. ఈ సమయంలో సినిమాలో మరో హీరోయిన్ గా కేథరిన్ తెర్సాను ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది. హీరోయిన్‌ గా ఈమె పలు సినిమాల్లో నటించినా కూడా అవేవి పెద్దగా ఈమెకు స్టార్‌ డమ్‌ ను తెచ్చి పెట్టలేదు. కాని ఇలా సెకండ్‌ హీరోయిన్‌ గా ఆఫర్లు మాత్రం బాగానే వస్తున్నాయి. ఐటెం సాంగ్స్ మరియు సెకండ్‌ హీరోయిన్‌ పాత్రల్లో నటిస్తున్న కేథరిన్‌ కు ఈ అవకాశం దక్కింది. నితిన్‌ తో ఒక పాటలో కూడా ఈమె కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

అల్లు అర్జున్‌ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందిన సరైనోడు సినిమా లో కేథరిన్ తెర్సాకు మంచి పాత్ర దక్కింది. ఆ సినిమా లో ఎమ్మెల్యేగా ఈమె కనిపించింది. అప్పటి నుండి కూడా తెలుగు ప్రేక్షకులు ఈమెను ఎమ్మెల్యేగానే పిలుస్తున్నారు. ఇప్పుడు కాకతాళీయంగా మాచర్ల నియోజక వర్గం  లో ఎమ్మెల్యే అయిన కేథరిన్ ఎంపిక అయ్యింది. ఈ సినిమా తో అయినా మళ్లీ ఫుల్ టైమ్‌ హీరోయిన్ గా ఈమెకు ఆఫర్‌ దక్కుతుందో చూడాలి. హీరోయిన్‌ గా మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని సినిమాలతో ఆకట్టుకుంటుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. తెలుగు లోనే కాకుండా ఈమెకు ఇతర భాషల్లో కూడా ఆఫర్లు వస్తున్నాయి.

నితిన్ కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో అన్నింటికి ఈ సినిమాలో ప్రత్యేకంగా యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు. నితిన్‌ కు ఇది ఖచ్చితంగా ఒక మంచి బ్రేక్ ఇచ్చే సినిమా అవుతుందని దర్శకుడు రాజశేఖర్ రెడ్డి అంటున్నాడు. ఉప్పెన తో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్స్‌ జాబితాలో చోటు దక్కించుకున్న కృతి శెట్టి వల్ల కూడా ఈ సినిమాకు మంచి బజ్ ఉంది. సొంత నిర్మాణ సంస్థలో నితిన్ ఈ సినిమాను చేస్తున్నాడు. వరుసగా సినిమాలను కరోనా సమయంలో విడుదల చేసిన నితిన్‌ వచ్చే ఏడాది సమ్మర్ లో ఏప్రిల్‌ 29న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇద్దరు హీరోయిన్స్ తో మాచర్ల నియోజక వర్గంలో నితిన్ చేయబోతున్న రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.