Begin typing your search above and press return to search.

పవన్ తో ఎప్పుడు నటిస్తావ్ బేబి?

By:  Tupaki Desk   |   10 Aug 2017 11:02 AM IST
పవన్ తో ఎప్పుడు నటిస్తావ్ బేబి?
X
వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటు.. జయాపజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్ లో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ కేథరిన్. టాప్ హీరోయిన్ గా కొనసాగకపోయిన ఎలాంటి పాత్ర వచ్చిన చేస్తూ సినిమాల్లో కథను మలుపు తిప్పే హీరోయిన్ గా కొనసాగుతోంది. టాప్ హీరోలతో అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఈ భామకు ఓ వర్గం ఫ్యాన్స్ బాగా సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే బుధవారం కేథరిన్ కర్నూలు నగరంలో ఓ మెబైల్ షాప్ ఓపెనింగ్ కు వెళ్ళింది కేథరిన్. దీంతో ఆమె రాకను గమనించిన జనాలు కేథరిన్ ను చూడడానికి అధిక సంఖ్యలో ఎగబడ్డారు. దీంతో ఆ హీరయిన్ తనకోసం అంతమంది వచ్చిన తీరుకు తేగా ఆనందపడిపోయింది. అంతే కాకుండా అక్కడ ఉన్నవారందరూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఎప్పుడు నటిస్తారు అని అడగ్గానే ఈ అమ్మడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. దీన్ని భట్టి చూస్తుంటే.. మెగా ఫ్యాన్స్ కేథరిన్ ని ఏ స్థాయిలో ఇష్టపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.

ఇక పవన్ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు కేథరిన్ తనదైన శైలిలో సమాధానాన్ని ఇచ్చింది. అవకాశం వస్తే తప్పకుండా పవర్ స్టార్ తో నటిస్తానని చెప్పడంతో ఫ్యాన్స్ విజిల్స్ తో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది.అదే విధంగా శుక్రవారం రిలీజ్ కాబోతున్న నేనే రాజు నేనే మంత్రి సినిమాను ఆదరించాలని కోరుతూ.. సినిమాను థియేటర్స్ లోనే చుడండి పైరసీని ఎంకరేజ్ చేయొద్దని సందేశాన్ని ఇచ్చింది కేథరిన్.