Begin typing your search above and press return to search.

పాపకి బాయ్‌ఫ్రెండ్‌ కావాలట

By:  Tupaki Desk   |   30 Jun 2015 10:30 PM IST
పాపకి బాయ్‌ఫ్రెండ్‌ కావాలట
X
అందం ఉంది. ప్రతిభ ఉంది. కానీ అదృష్టమే లేదు క్యాథరిన్‌కి. స్టార్‌ హీరో, స్టార్‌ డైరెక్టర్‌లతో పనిచేసినా టాలీవుడ్‌లో ఆశించిన బ్రేక్‌ రాలేదు. ఫలితం పొరుగు భాషల్లో అవకాశాలు వెతుక్కోవాల్సి వచ్చింది. ఆ ప్రయత్నంలో భాగంగానే తమిళ పరిశ్రమకు వెళ్లింది. అక్కడ హీరో కార్తీ తొలి అవకాశం ఇచ్చి ఎంకరేజ్‌ చేశాడు. అతడి సరసన నటించిన మద్రాస్‌ పెద్ద సక్సెస్‌ సాధించింది.

ఆ వెంటనే క్రేజీ డైరెక్టర్‌ సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో అవకాశం అందుకుంది. అతడి దర్శకత్వంలో కాన్‌ అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే విష్ణు విశాల్‌ చిత్రం వీర ధీర సూరన్‌లోనూ నాయికగా నటిస్తోంది. ఈ రెండు సినిమాలకు కాల్షీట్లు కేటాయించి క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. ఇటీవలే ఫిలింఫేర్‌ ఉత్సవాల్లో ఈ అమ్మడు సరికొత్త అవతారంలో కనిపించి అభిమానులకు షాకిచ్చింది. ఆ నవయవ్వన సమ్మోహన రూపానికి ఫిదా అయిపోయిన అభిమానులంతా తనతో సెల్ఫీ దిగడానికి పోటీపడ్డారు.

అయితే అసలు సెల్ఫీ గాళ్‌ని కాను నేను. కానీ అభిమానుల కోసం దిగాల్సొచ్చిందని చెప్పింది. మరి బోయ్‌ ఫ్రెండ్‌ లేడా? అన్న ప్రశ్నకు ఠపీమని స్పందిస్తూ ..'బోయ్‌ఫ్రెండ్‌ (బిఎఫ్‌) ఉంటే బావుణ్ణు. చాలా ఫన్నీగా ఉండేది' అని సమాధానమిచ్చింది. బిఎఫ్‌ ఉంటే ఏం ఫన్‌ ఆస్వాధిస్తుందంటారు? ప్రశ్న రెయిజ్‌ చేస్తే బావుండదని అడగలేదు కానీ...