Begin typing your search above and press return to search.

ఇసుక రాళ్ళలో హీరోయిన్ ఇబ్బందులు

By:  Tupaki Desk   |   6 Aug 2017 5:00 AM IST
ఇసుక రాళ్ళలో హీరోయిన్ ఇబ్బందులు
X
సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసిన తరువాత తారల మదిలో ఒక ఆందోళన ఖచ్చితంగా ఉంటుంది. సినిమా హిట్ అయితే వారు పడ్డ కష్టాన్ని చాలా వరకు మర్చిపోతారు. కానీ అభిమానులు తిప్పి కొడితే మాత్రం ఎంతో బాధపడతారు. వారు పడ్డ కష్టాన్ని తరచు గుర్తు చేసుకొని ఏం తప్పు జరిగిందా అని ఆలోచనలో పడటం కామన్. అయితే షూటింగ్ సమయంలో వారు కొన్ని సీన్లకు అలవాటు లేని జీవితాన్ని చూడాల్సి వస్తుంది. ఎప్పుడు అనుభవించని కొన్ని ఘటనలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

కొందరు స్టార్ లు వాటిని ఛాలెంజ్ గా తీసుకొని చేస్తే మరి కొందరు స్టార్ లు రిస్క్ లేకుండా.. డుబ్ లతో చేయిస్తుంటారు. కానీ చాలా వరకు హీరోయిన్లు కొన్ని అలవాటు లేని ప్రాంతాల్లో షూటింగ్ చేసి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారట. రీసెంట్ గా క్యాథెరిన్ ట్రెసా ఇదే విషయాన్నీ చెప్పుకొచ్చింది. ఆర్య హీరోగా కదంబన్ అనే ఓ తమిళ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ షూటింగ్ లో చాలా కష్టాలను అనుభచిందట. తన లేత పాదాలతో అలవాటు లేని ఇసుక రాళ్లలో నడిచి తెగ ఇబ్బందిపడిందట. అంతే కాకుండా ఆ సినిమా అడవి ప్రాంతాల్లో ఎక్కువగా షూట్ చేయడం వల్ల కొంత దూరం నడవాల్సి వచ్చేదని చివరకు ఆ చిత్రం ఎప్పుడు అయిపోతుందా అని అనుకునేదట.

అలాగే ఆ మూవీ షూటింగ్ లో కాళ్ళకి కాయలు కాయలు కాయడంతో నడవడానికి చాలావరకు ఇబ్బంది పడిందని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆ చిత్రం పరవాలేదనిపించినా క్యాథెరిన్ మాత్రం కొంత నిరాశ చెందిందట. అవునులే.. మద్రాస్ కదంబన్ వంటి సినిమాలతో అమ్మడు పెద్ద హీరోయిన్ అయిపోదాం అనుకుంది.. ఇప్పుడు అవన్నీ మిస్సయిపోయాయ్ గా!!