Begin typing your search above and press return to search.

150 నుండి క్యాథరీన్ ఔట్? గొడవే కారణం?

By:  Tupaki Desk   |   13 Oct 2016 7:33 AM GMT
150 నుండి క్యాథరీన్ ఔట్? గొడవే కారణం?
X
నిజానికి మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాలో ఐటెం సాంగ్ కూడా ఉందంటేనే చాలా షాకింగ్ విషయం. అయితే ఆ పాటను చేస్తోంది క్యాథరీన్ త్రెసా అనేసరికి ఇంకాస్త షాకింగ్ గా ఉంది. ఇకపోతే ఇప్పుడు ఆమెను రీప్లేస్ చేశారనే న్యూస్ వస్తోంది. ఎందుకంటే ఆమె ఒక గొడవ కారణంగా అవుటాఫ్‌ ప్రాజెక్టు అనే టాక్ వస్తోంది.

నిజానికి క్యాథరీన్ నిన్నటి నుండే షూటింగ్ మొదలెట్టింది. అయితే చిరంజీవికి చాలా క్లోజ్ గా ఉండే ఒక చీఫ్‌ టెక్నీషియన్ తో క్యాథరీన్ గొడవపడటంతో.. ఆమెను షూటింగ్ నుండి తప్పించారట. ఆమె ప్లేసులో మరో హీరోయిన్ లక్ష్మీ రాయ్ ను తీసుకున్నారని తెలుస్తోంది. అదేంటోగాని.. ఆల్రెడీ పవన్ కళ్యాణ్‌ తో నటించిన కాజల్ ను హీరోయిన్ ను తీసుకోవడం.. అదే సినిమాలో ఐటెం బాంబుగా చేసిన లక్ష్మీ రాయ్ ను ఇప్పుడు ఐటెం సాంగుకే తీసుకోవడం.. ఖైదీ నెం 150కే చెల్లింది.

అయితే క్యాథరీన్ గొడవపడింది లారెన్స్ మాష్టర్ తోనని.. ఆయన చెప్పిన కాస్ట్యూమ్స్ వేసుకోకుండా ఆయన చెప్పిన స్టెప్పులను ప్రాక్టీస్ చేయకుండా షూటింగ్ ను డిలే చేయడంతో ఆమెను తీసేశారని అంటున్నారు. ఎంతవరకు నిజమో మరి క్యాథరీనే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/