Begin typing your search above and press return to search.

'దృశ్యం' సక్సెస్ విషయంలో కాస్టింగ్ అడ్డుపడిందా..??

By:  Tupaki Desk   |   6 May 2021 12:30 AM GMT
దృశ్యం సక్సెస్ విషయంలో కాస్టింగ్ అడ్డుపడిందా..??
X
ఈ ఏడాది రిలీజ్ అయినటువంటి సౌత్ మూవీస్ లో కొంతకాలంగా చిత్రపరిశ్రమలలో వినిపిస్తున్న పేరు దృశ్యం-2. మలయాళంలో తెరకెక్కిన ఈ సీక్వెల్ మూవీ దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, మీనా కలిసి నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం సినిమాకు సీక్వెల్ గా రూపొందింది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన దృశ్యం-2 అన్ని వర్గాల వారిని మెప్పించి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ పార్ట్ రూపొందించిన దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సీక్వెల్ కూడా రూపొందించాడు. అయితే దృశ్యం కంటే సీక్వెల్ దృశ్యం-2 భారీ సక్సెస్ కావడం విశేషం.

ఫస్ట్ మూవీ దృశ్యం లాగే ఇప్పుడు దృశ్యం-2 కూడా ఇతర భాషల్లోకి రీమేక్ అవుతోంది. ఇప్పటికే పలు భాషల రీమేక్ హక్కులను కూడా దక్కించుకున్నారు మేకర్స్. అయితే ఫస్ట్ పార్ట్ దృశ్యం మూవీ తెలుగుతో పాటుగా బాలీవుడ్ లో కూడా అదేపేరుతో రీమేక్ అయింది. తెలుగులో దృశ్యంలో నటించిన వెంకటేష్, మీనాలే ఈసారి సీక్వెల్ లో కూడా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా.. దృశ్యం హిందీ రీమేక్ లో స్టార్ హీరో అజయ్ దేవగన్, శ్రీయశరన్, టబు ప్రధానపాత్రలలో నటించారు. ఇప్పుడు హిందీలో కూడా దృశ్యం-2 తెరకెక్కనుంది. ఇప్పటికే బాలీవుడ్ రీమేక్ రైట్స్ పనోరమా ఇంటర్నేషనల్ స్టూడియోస్ వారి కుమార్ మంగత్ దక్కించుకున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం.. హిందీలో దృశ్యం సినిమా భారీ హిట్ కాలేదు కానీ మాములుగా ఆడింది. ఎందుకంటే ఈ సినిమాలో కాస్టింగ్ లోపం కనిపిస్తుందని బాలీవుడ్ వర్గాలలో టాక్. అజయ్ దేవగన్ - శ్రీయా సెట్ కాలేదని.. అలాగే పోలీస్ పాత్రలో టబు కూడా చేంజ్ అయితే బాగుటుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో నిజం ఉందో లేదో తెలియదు కానీ అదే కాస్ట్ పెడితే మాత్రం సినిమాకి మైనస్ అవుతుందని పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. ఓవైపు అజయ్ దేవగన్ నటిస్తున్న సినిమాల షూటింగ్స్ ముగియగానే 'దృశ్యం-2' సెట్స్ మీదకు వెళ్ళనుందని సమాచారం. చూడాలి మరి మేకర్స్ ఈసారి కాస్టింగ్ లో చేంజెస్ చేస్తారేమో..!