Begin typing your search above and press return to search.

తెరవెనుక కోరిక తీరిస్తేనే ఛాన్సట

By:  Tupaki Desk   |   9 Nov 2017 9:23 AM GMT
తెరవెనుక కోరిక తీరిస్తేనే ఛాన్సట
X
కాస్టింగ్ కౌచ్ - ఈ పదం ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ నుంచి బాగా వినిపిస్తోంది. తెర వెనుక జరిగే చీకటి రహస్యాలను వెలుగులోకి వచ్చి మరి చెబుతున్నారు సినీ హీరోయిన్స్. మొన్నటి వరకు ఈ పదం(కాస్టింగ్ కౌచ్) తెలియని వారికి కూడా ఇదేంటో తెలిసిపోయేలా చాలా మంది హీరోయిన్స్ సోషల్ మీడియా ద్వారా అలాగే పలు ఇంటర్వ్యూలలో గట్టిగా చెప్పారు.

అయితే అదే తరహాలో హాట్ బ్యూటీ లక్ష్మి రాయ్ కూడా పెదవి విప్పింది. అవును కాస్టింగ్ కౌచ్ సంస్కృతి ఇంకా ఉంది. ఎటువంటి సపోర్ట్ లేకుండా హీరోయిన్ అవుదామని కొత్తగా వచ్చే అమ్మాయిలకు అవకాశం రావాలంటే తెర వెనుక కోరిక తీర్చాల్సిందే అని డైరెక్ట్ గా చెప్పేసింది. అయితే తనకు ఇలాంటి అనుభవాలు చాలా ఎదురయ్యాయని కానీ వాటిని నేను తిరస్కరించానని చెప్పుకొచ్చింది. ఈ మధ్యన హాలీవుడ్ లో ఒక నిర్మాత అకృత్యాలు బయటపడటంతో హీరోయిన్స్ సోషల్ మీడియాలో మీటూ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేసి లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లు చెప్పారు.

అయితే లక్ష్మి రాయ్ మాత్రం బాలీవుడ్ లో ఇలాంటివి ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ సౌత్ లో మాత్రం ఉన్నాయని వివరించింది. ''నన్ను డైరక్టుగా అడగలేదు కాని.. ఒక రాత్రి పడుకుంటే నీకు చాన్సు ఇస్తాం అని చాలామంది పరోక్షంగా చెప్పారు. నేను అలాంటి ఆఫర్లను తిరస్కరించాను. క్యాస్టింగ్ కౌచ్ ఉన్నప్పటికీ.. దానికి లొంగుతామా లేదా అనేది మన చేతిలో ఉంటుంది'' అంటూ చెప్పింది అమ్మడు. ప్రస్తుతం అమ్మడు నటించిన జూలీ 2 సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. సినిమాలో అలాంటి సన్నివేశాలు కూడా ఉంటాయట. మరి ఎందుకు ఇంత లెట్ గా చెప్పిందో గాని అమ్మడు ఇచ్చిన స్టేట్ మెంట్ మాత్రం సినిమాకి క్రేజ్ తెచ్చింది.