Begin typing your search above and press return to search.

శర్వానంద్ సినిమాకు క్యాస్టింగ్ కాల్

By:  Tupaki Desk   |   28 Jan 2019 11:28 AM GMT
శర్వానంద్ సినిమాకు క్యాస్టింగ్ కాల్
X
ఎప్పుడూ దిల్ రాజు గారి బ్యానర్ లో విజయాల శాతం ఎక్కువ. కానీ గత సంవత్సరం మాత్రం గట్టిగా ఎదురు దెబ్బలే తగిలాయి. ఈ ఏడాది కూడా 'వినయ విధేయ రామ' డిస్ట్రిబ్యూషన్లో నష్టాలు వచ్చినప్పటికీ 'F' ఘన విజయం సాధించడంతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు. 'F2' సినిమా సాధించిన జోష్ లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కొత్త ప్రాజెక్టులను పట్టాలెక్కించే ప్రయత్నాలలో ఉన్నారు.

ఈ ప్రాజెక్టులలో తమిళం లో సూపర్ హిట్ అయిన '96' సినిమా రీమేక్ ఒకటి. ఈ సినిమాను శర్వానంద్ - సమంతాలు హీరో హీరోయిన్లుగా తెలుగులో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో శర్వానంద్ టీనేజ్ అబ్బాయిగా కూడా కనిపించాల్సి ఉంది. ఈ పాత్ర కోసం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు క్యాస్టింగ్ కాల్ ఇచ్చారు. "యంగ్ శర్వానంద్ కావాలి .. ఈ పాత్రను పోషించడానికి ఆసక్తి ఉండే 14 నుండి 20 ఏళ్ళ మధ్యలో ఉన్నవారు మీ వివరాలను 10 ఫోటోలతో svc034gmail.com కు పంపండి.

మరి మీలో ఎవరైనా ఆ వయసువారు ఉంటే.. ఆ పాత్ర పోషించాలనే ఆసక్తి ఉంటే ఆలస్యం ఎందుకు. వెంటనే ఆ వివరాలు పైనున్న మెయిల్ ఐడీకి పంపండి. ఇంతకంటే మంచి అవకాశం మరొకటి ఉండదు. ఆలసించిన ఆశాభంగం!