Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కోసం ఆడిషన్స్.. గెట్ రెడీ

By:  Tupaki Desk   |   5 Jun 2018 5:01 PM GMT
ఎన్టీఆర్ కోసం ఆడిషన్స్.. గెట్ రెడీ
X
నందమూరి తారక రామారావు బయోపిక్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ చిత్ర కోసం ముందు చేసిన పనులు మళ్లీ మొదటికి వచ్చాయని తెలుస్తోంది. దర్శకుడు క్రిష్ ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యాక మొత్తం ప్లాన్ మారిపోయింది. ఓ వైపు మణికర్ణిక పనులు ఎండింగ్ దశలో ఉన్నప్పటికీ అప్పటిలోపు క్యాస్టింగ్ పనులను పూర్తి చేయాలని తన గ్యాంగ్ కి పనులు అప్పగించాడు.
ఎన్టీఆర్ కథ అయితే మొత్తానికి పూర్తయ్యింది.

తనకు తగ్గట్టుగానే దర్శకుడు క్రిష్ స్క్రీన్ ప్లేను మార్చుకున్నాడట. ఇకపోతే సినిమాలో కీలకమైన పాత్రల కోసం చిత్ర యూనిట్ ఆడిషన్స్ నిర్వహించనుంది. గతంలో ఎప్పుడు లేని విదంగా దాదాపు సగం మంది నటీనటులను ఈ ఆడిషన్ లోనే ఫిక్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆడిషన్ కోసం ఎన్టీఆర్ టీమ్ ఒక ప్రకటనను రిలీజ్ చేసింది. ఆసక్తి ఉన్నవాళ్లు ఈ మెయిల్ ద్వారా వివరాలను పంపాలని కోరారు. రెండు ఫోటోలతో పాటు 30 సెకన్ల యాక్టింగ్ సెల్ఫీ వీడియో తీసి మెయిల్ కి ఫోన్ నెంబర్ తో సహా పంపాలని పేర్కొన్నారు.

ఎన్.బి.కె ఫిల్మ్ నిర్మాణం లో బాలకృష్ణ సొంతంగా ఎన్టీఆర్ సినిమాను నిర్మిస్తున్నారు. దర్శకుడు క్రిష్ తను నెక్స్ట్ తీయాలని అనుకున్న ప్రాజెక్ట్ ను సైతం పక్కనపెట్టి ఈ బయోపిక్ చేయడానికి ఒప్పుకున్నాడు. ప్రధాన పాత్రలు కోసం క్రిష్ కొంత మంది సీనియర్ ఆర్టిస్ట్ లను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మరికొన్ని రోజుల్లో మిగిలిన పాత్రలకు సంబంధించిన నటీనటులను కూడా సెలెక్ట్ చేసి షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.