Begin typing your search above and press return to search.

మూడో భార్య వసూళ్లతో సంబంధం లేదంటున్న నరేష్..!

By:  Tupaki Desk   |   22 Feb 2022 12:30 PM GMT
మూడో భార్య వసూళ్లతో సంబంధం లేదంటున్న నరేష్..!
X
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతిపై కేసు నమోదు చేయబడింది. నరేష్ పేరు చెప్పి ఆమె చాలామంది వద్ద డబ్బులు వసూలు చేసినట్లు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌ లో ఐదుగురు మహిళలు ఫిర్యాదు చేశారు. అయితే త‌న పేరు చెప్పుకుని ర‌మ్య ర‌ఘుప‌తి అనే మ‌హిళ‌న చేస్తున్న డ‌బ్బు వ‌సూళ్ల‌తో తనకు ఎలాంటి సంబంధం లేద‌ని న‌రేష్ పేర్కొన్నారు.

వివరాల్లోకి వెళ్తే.. సీనియర్ నరేష్ కి రమ్య రఘుపతి మూడో భార్య. 8 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న ఈ జంటకు ఓ కుమారుడు కూడా ఉన్నారు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు చోటు చోసుకోవడంతో ప్రస్తుతం వీరిద్దరు విడిగా ఉంటున్నారని తెలుస్తోంది. అయితే న‌రేష్‌ ఆస్తుల్లో త‌న‌కు భాగం వుందని ప‌లువురి నుంచి భారీ మొత్తంలో డ‌బ్బు వసూలు చేసినట్లు ఆరోప‌ణ‌లు వచ్చాయి.

ఈ విధంగా హైదరాబాద్ - అనంతపూర్ - హిందూపూర్‌ లలో పలువురి వద్ద రమ్య రఘుపతి కొన్ని కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అయితే రమ్య చేతిలో మోసపోయిన ఐదుగురు మహిళలు ఫిర్యాదు చేయడంతో ఈ అంతా గుట్టు బయటపడిందని తెలుస్తోంది. ఇక ర‌మ్య ర‌ఘుప‌తి డ‌బ్బు వ‌సూళ్ల‌తో త‌న‌కెలాంటి సంబంధం లేద‌ని న‌రేష్ ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇకపోతే రమ్య రఘుపతి అనంతపురం జిల్లా సీనియ‌ర్ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి సోదరుని కుమార్తె అని కథనాలు వస్తున్నాయి. దర్శకుడు నీలకంఠ దగ్గర అసిస్టెంట్‌ గా పని చేసిన ఆమె.. ఆ తర్వాత న‌రేష్ త‌ల్లి విజయ నిర్మల దగ్గర కో డైరెక్టర్‌ గా కూడా వర్క్ చేశారట. ఆ సమయంలో నరేష్‌ తో రమ్యకు ఏర్పడిన పరిచయం పెళ్లిదాకా దారితీసిందట. 50 ఏళ్ళ వయసులో తనకన్నా చాలా తక్కువ వయసున్న యువతిని పెళ్లి చేసుకోవడంపై అప్పట్లో వార్తలు వచ్చాయి.

అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో గత కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారని తెలుస్తోంది. ఇప్పుడు నరేష్ పేరు చెప్పి రమ్య డబ్బులు వసూలు చేస్తోందనే ఆరోపణలు రావడంతో వీరి మధ్య సంబంధం చర్చకు వచ్చింది. ఇక మాజీ భార్య వ్యవహారంతో తనకేం సంబంధం లేదని నరేష్ చెప్పడంతో.. మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమ్యను పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేయనున్నారని తెలుస్తోంది.