Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ బిగ్ బాస్ శిక్షలపై పిటీషన్
By: Tupaki Desk | 7 Aug 2017 10:11 AM ISTతెలుగు టివి షోలలోనే ఏ టివి షోకు రానంత టీఆర్పీ ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్ కు వచ్చింది. ఈ కార్యక్రమాన్ని చాలామంది వీక్షించడం వలన స్టార్ మా ఛానల్ కూడా నెం.1 స్థానానికి ఎగబాకింది. అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నైతిక విలువలను కాలరాస్తూ.. మానవ హక్కులను ఉల్లంఘిస్తోంది అంటూ ఒక పెద్దాయన కోర్టుకెక్కారు. పదండి ఆయన వాదన ఏంటో విందాం.
ప్రతిరోజూ కొన్ని కోట్ల మంది చూస్తున్న ఈ ప్రోగ్రామ్ లో ఇప్పుడు కంటెస్టంట్లకు రకరకాలు పనిష్మెంట్లు ఇస్తున్నాడు ఎన్టీఆర్. అందులో ముఖ్యంగా మొన్న హీరో ప్రిన్స్ కు 50 డిప్స్ చేయాల్సిందిగా శిక్షించాడు ఎన్టీఆర్. అలా స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళి యాభై గుంజీలు తీయడం ప్రాణానికే ప్రమాదకరమంటూ ఇప్పుడు హుమన్ రైట్స్ కమీషన్ ఎదుట పిటీషన్ నమోదైంది. అదే విధంగా ముమాయత్ ఖాన్ వంటి సెలబ్రిటీలకు మాట్లాడకుండా నోటికి టేప్ వేయడం అనేది కూడా చట్టవిరుద్దం అంటున్నారు పిటీషనుదారుడు. కోర్టులకే తప్పు ప్రూవ్ కాకుండా శిక్షించే అధికారం లేనప్పుడు.. బిగ్ బాస్ కు ఎక్కడనుండి వచ్చింది అనేది ఆయన ప్రశ్న.
పిల్లలను తప్పుడుదారి పట్టించే కారణం ఉండటంచేత ఇప్పుడు బిగ్ బాస్ పై చర్యలు తీసుకోవాలంటూ మానవ హక్కుల సంఘం ఎదుట ఈ పిటీషన్ దాఖలైంది. సోమవారం నాడు ఈ పిటీషన్ పై విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. చూద్దాం ఏమవుతుందో.
