Begin typing your search above and press return to search.

బాలికపై దాడి.. సీనియర్ హీరోయిన్ పై ఫిర్యాదు!

By:  Tupaki Desk   |   24 Jan 2019 10:28 AM GMT
బాలికపై దాడి.. సీనియర్ హీరోయిన్ పై ఫిర్యాదు!
X
సీనియర్ నటి భాను ప్రియ చిక్కుల్లో పడ్డారు. ఆమెపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట పోలీసులు బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు భానుప్రియపై కేసు నమోదు చేశారు. భాను ప్రియ ఇంట్లో పనికోసం 14 ఏళ్ల తన కూతురును పంపానని.. ఆర్థిక ఇబ్బందుల వల్ల పనికి పెడితే ఆమెను భానుప్రియ ఫ్యామిలీ వేధింపులకు గురిచేశారని ప్రభావతి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది..

ప్రభావతి మాట్లాడుతూ ఏడాదికాలంగా భానుప్రియ ఇంట్లో పనిచేస్తున్న తన కుమార్తెను ఇంటికి పంపించడం లేదని.. కనీసం ఫోన్ లో కూడా మాట్లాడనీయడం లేదని ఆరోపించింది. ఇంట్లోనే నిర్భంధించారని ఆరోపిస్తోంది. గట్టిగా మాట్లాడినా.. గొడవ చేసినా చోరీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని మీడియాకు వెల్లడించింది. అందులో భాగంగానే చైల్డ్ లైన్ హెల్స్ సభ్యుల సహకారంతో సామర్లకోట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలిపింది.

భానుప్రియపై వచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తున్నామని సామర్లకోట పోలీసులు తెలిపారు. ఫిర్యాదులో భాను ప్రియ సోదరుడు లైంగిక దాడి చేశారన్న దానిపై నిజనిజాలు నిర్ధారణ అయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు.

కాగా పిల్లలతో పనిచేయించడం చట్టరీత్యానేరం. వేధింపులు - బెదిరింపులకు కూడా మరో కేసు నమోదవుతుంది. ఇలా ప్రభావతి ఫిర్యాదు మేరకు భానుప్రియ ప్రస్తుతం చిక్కుల్లో పడ్డట్టేనని తెలుస్తోంది.