Begin typing your search above and press return to search.

వివాదంలో చిక్కుకున్న షారుఖ్ ఖాన్ జీరో

By:  Tupaki Desk   |   6 Nov 2018 8:57 AM GMT
వివాదంలో చిక్కుకున్న షారుఖ్ ఖాన్ జీరో
X
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ హీరోగా ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'జీరో'. ఫిలిం మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను రెండు రోజుల క్రితం విడుదల చేశారు. షారూఖ్ మరుగుజ్జు పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అదేసమయంలో ఒక వివాదంలో కూడా చిక్కుకుంది.

తమ మనోభావాలను దెబ్బతీసేలా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయని సిక్కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ సిక్కు గురుద్వార్‌ కమిటీ జనరల్‌ సెక్రటరీ మజిందర్‌ సింగ్‌ సిర్సా ఢిల్లీ పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం నాడు ఈ విషయం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. షారుఖ్‌తో పాటు చిత్ర దర్శకుడు ఆనంద్‌ ఎల్‌.రాయ్‌పై అయన కేసు నమోదు చేశారని సమాచారం. సిక్కులు ఎంతో పవిత్రంగా భావించే గట్రాకిర్పాన్(చిన్న కత్తి లేదా పిడి బాకు)ను షారూఖ్ ఈ సినిమాలో ధరించాడని.. సంప్రదాయం ప్రకారం అది అమృతధారి సిక్కులు మాత్రమే ధరించాలని అయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇది సిక్కులను కించపరచడమేనని అయన అంటున్నారు. కాబట్టి సిక్కులకు అభ్యంతరకరమైన సన్నివేశాలను 'జీరో' సినిమానుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. సిక్కులను అవమానించినందుకు హీరో.. దర్శకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఈ వివాదంపై 'జీరో' టీమ్ గానీ.. షారూఖ్ ఖాన్ గానీ ఇంకా స్పందించలేదు.