Begin typing your search above and press return to search.

క్రేజీ అంకుల్స్ పై పోలీస్ కేసు న‌మోదు

By:  Tupaki Desk   |   19 Aug 2021 7:43 AM GMT
క్రేజీ అంకుల్స్ పై పోలీస్ కేసు న‌మోదు
X
`ప్రేమ ఇష్క్ కాద‌ల్` చిత్రంతో స‌క్సెస్ అందుకుంది ప్రముఖ టీవీ యాంకర్ శ్రీముఖి. ప‌లువురు యువ‌తార‌ల‌తో క‌లిసి న‌టించిన ఈ సినిమాలో శ్రీ‌ముఖి పాత్ర ఆక‌ట్టుకుంటుంది. ఆ త‌ర్వాతా అడ‌పాద‌డ‌పా సినిమాల్లో న‌టిస్తున్నా బుల్లితెర యాంక‌ర్ గా బిజీ వ‌ల్ల‌ క‌థానాయిక‌గా న‌టించి చాలా కాల‌మే అయ్యింది. ఈరోజు విడుదలైన క్రేజీ అంకుల్స్ తో తిరిగి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనుంది ఈ బ్యూటీ. ఈ సినిమా ట్రైలర్ ఇప్ప‌టికే యూత్ లో క్రేజీ గా దూసుకెళ్లింది. యంగ్ యాంక‌ర్ శ్రీ ముఖితో సరసస‌ల్లాపాల కోసం వెంప‌ర్లాడే 50 ఏళ్ళ `అంకుల్స్` క‌థ ఇది. ఇటీవ‌ల విడుద‌లైన‌ ట్రైలర్ ఇప్పుడు చిత్రనిర్మాతలను ఇబ్బందుల్లోకి నెట్టింది.

తెలంగాణ మహిళా హక్కుల వేదికకు చెందిన పలువురు మహిళా హక్కుల కార్యకర్తలు ఈ ట్రైలర్ మహిళలను కించపరిచే విధంగా ఉంద‌ని దేశంలోని సామాజిక నిర్మాణానికి విఘాతం కలిగిస్తోందని ఆరోపిస్తూ క్రేజీ అంకుల్స్ బృందంపై కేసు నమోదు చేశారు. నిరసనకారులు సినిమాను నిషేధించాలని డిమాండ్ చేశారు. యాధృచ్ఛికంగా క్రేజీ అంకుల్స్ CBFC నుండి UA సర్టిఫికెట్ అందుకుంది.

వివాదంతో స్టార్ట‌య్యింది కాబ‌ట్టి అది క్రేజీ అంకుల్స్ ప్ర‌చారానికి క‌లిసొచ్చేదే. కానీ స‌జావుగా థియేట‌ర్ల‌లో ఆడాలంటే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల్సి ఉంటుంది. న‌గ‌రాల్లోని నివాస స‌ముదాయాల్లో అంకుల్స్ అంద‌రికీ గిలిగింత‌లు పెట్టే చిలిపి అల్ల‌రి కంటెంట్ తో తెర‌కెక్కిన ఈ చిత్రం అంతిమ ఫ‌లితం ఎలా ఉండ‌నుంది? అన్న‌ది తెలియాలంటే కాస్త ఆగాల్సిందే.