Begin typing your search above and press return to search.

బన్నీ వాసుపై ఆ నటి ఫిర్యాదు.. కేసు కడతారా?

By:  Tupaki Desk   |   13 Oct 2021 5:31 AM GMT
బన్నీ వాసుపై ఆ నటి ఫిర్యాదు.. కేసు కడతారా?
X
టాలీవుడ్ నిర్మాతల్లో ఒకరైన బన్నీ వాసు మీద జూనియర్ ఆర్టిస్టు సునీత బోయ గడిచిన కొంతకాలంగా ఆరోపణలు చేయటం.. ఆయన ఆఫీసు వద్ద ఆందోళన చేస్తుండటం తెలిసిందే. పలుమార్లు బన్నీ వాసు మీద ఆమె చేసిన వ్యాఖ్యలు.. విమర్శలు తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఆమె మరో అడుగు ముందుకు వేశారు. తాజాగా ఆమె తన స్వగ్రామంలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో బన్నీ వాసుపై తాజాగా ఆమె అనంతపురం ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్పను కలిసి కంప్లైంట్ చేశారు. తనకు న్యాయం చేయాలనికోరారు. తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి నిర్మాత బన్నీ వాసు తనను మోసం చేశారంటూ పాత విషయాన్నే మరోసారి ప్రస్తావించారు. తనకు న్యాయంచేయాలని కోరారు.

దీంతో స్పందించిన అనంతపురం జిల్లా ఎస్పీ ఈ ఉదంతంపై వివరాలు సేకరించాలన్నారు. ఎస్పీ ఆదేశాల నేపథ్యంలో సునీతను ఆమె తల్లిని దిశ పోలీస్ స్టేషన్ లో విచారణ చేపట్టారు. అనంతరం ఈ అంశాల్ని మీడియాతో మాట్లాడారు. బన్నీ వాసు మీద సునీత చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాల్ని తమకు ఇస్తే.. వాటినిపరిశీలించి.. వాటి ఆధారంగా తాము కేసు నమోదు చేస్తామని డీఎస్పీ శ్రీనివాసులు వ్యాఖ్యానించటం గమనార్హం. సో.. సునీత చేసిన వ్యాఖ్యలతో బన్నీ వాసుకు ఇప్పటికిప్పుడు ఇబ్బందులు అయితే వచ్చే వీల్లేదు. ఆధారాలు చూపించి.. పోలీసులు వాటికి కన్వీన్స్ అయ్యాకే కేసు కట్టే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.