Begin typing your search above and press return to search.

ప్రియదర్శిని రామ్‌ 'కేస్‌ 99' ఫస్ట్ ఫైల్...!

By:  Tupaki Desk   |   13 Oct 2020 1:33 PM GMT
ప్రియదర్శిని రామ్‌ కేస్‌ 99 ఫస్ట్ ఫైల్...!
X
ప్రియదర్శిని రామ్‌ నటించి, దర్శకత్వం వహించిన లేటెస్ట్ చిత్రం ''కేస్‌ 99''. మెలోడ్రామా స్టూడియోస్ బ్యానర్ పై యువ నిర్మాతలు చిలుకూరి కీర్తి - గౌతమ్‌ రెడ్డి - వివేక్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమాజంలో జరుగుతున్న నేరాలు.. హత్యలు బలవన్మరణాలు, కిడ్నాప్‌ లు, అత్యాచారాల వెనక ఉన్న హ్యూమన్ ఎమోషన్ ని కీపాయింట్‌ గా చేసుకొని ప్రియదర్శిని రామ్‌ ఈ ఇన్వెస్టిగేషన్‌ డ్రామాను తెరకెక్కించారని తెలుస్తోంది. ఇటీవలే ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ ను విడుదల చేయగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ క్రమంలో తాజాగా 'కేస్‌ 99' నుంచి ఫస్ట్ ఫైల్ 'వై' (ఎందుకు) ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

'కేస్‌ 99' నుంచి ఫస్ట్ ఫైల్ లో ఒక అమ్మాయిని చూపిస్తుండగా బ్యాగ్రౌండ్ లో 'ఎందుకు కలిసావ్.. ఎందుకు మాట్లాడావ్.. ఎందుకు నవ్వావ్..' అని ఒక యువకుడు ప్రశ్నిస్తున్నట్లు చూపించారు. అలానే ప్రియదర్శిని రామ్‌ 'అమ్మాయి కనబడటం లేదు.. బాడీ దొరకడం లేదు..' అంటూ ఇన్వెస్టిగేషన్‌ స్టార్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 'టాస్‌' 'మనోడు' లాంటి విభిన్న చిత్రాలకు దర్శకత్వం వహించి రామ్‌.. 'కేస్‌ 99' అనే క్రైమ్ థ్రిల్లర్ తో మరోసారి తన ప్రత్యేకతను చాటుకోనున్నారని అర్థం అవుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్న ‘కేస్‌ 99’లో ప్రియ‌ద‌ర్శిని రామ్‌ తో పాటు తిరువీర్‌ - అనువ‌ర్ణ‌ - నిహాల్ కోదాటి - అజ‌య్ ఖ‌తుర్వార్‌ - అప‌రాజిత‌ - ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్‌ - క్రియేష్ రాజ్‌ - అశోక్ రావు - విజ‌య్ గోప‌రాజు - మ‌నోజ్ ముత్యం - నితిన్‌ - ప్ర‌స‌న్‌ - రోష‌న్ తదితరులు నటిస్తున్నారు. ఆషిక్ అరుణ్ ఈ చిత్రానికి సంగీతం అందించగా టి. సురేంద్ర రెడ్డి కెమెరామెన్ గా వ్యవహరించారు.