Begin typing your search above and press return to search.
12వ తరగతి పరీక్షల్ని రద్దు చేయించు రష్మికా!
By: Tupaki Desk | 25 May 2021 5:30 AM GMTకోవిడ్ మనిషి మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావంతం చేస్తోంది. మానవాళి ఆరోగ్యంపైనా జీవిన విధానంపైనా తీవ్ర దుష్ప్రభావం చూపిస్తోంది. ఇలాంటి కఠినమైన సమయంలో హోప్ ని పెంచాల్సిన బాధ్యత ఉందని యువనాయిక రష్మిక అంటున్నారు. మహమ్మారి కష్టకాలంలో ఇతరులకు సహాయం చేస్తున్న వారిని హైలైట్ చేయడానికి రష్మిక మండన్న #స్ప్రెడింగ్ హోప్ అనే ప్రత్యేక వేదికను ప్రారంభించారు. ఈ విషయాన్ని వెల్లడించేందుకు ఇన్ స్టాగ్రామ్ వీడియోని పోస్ట్ చేసింది.
``ఈ రెండు వారాల్లో.. కోవిడ్ నుంచి ఆదుకునేందుకు అసాధారణమైన పనులను చేస్తున్న సాధారణ వ్యక్తులను హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఇది నాకు ఆశను కలిగించింది. నా ముఖం మీద చిరునవ్వు తెచ్చింది. మనం ఇలాంటి కష్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు.. ఇంతకుమించి ఇంకేదీ అవసరం లేదని నాకు అర్థమైంది. భాష లేదా వారు ఉన్న ప్రదేశాల అవరోధం కాదు. ఎవరైనా వీడియోలను షేర్ చేయొచ్చు`` అని ఆమె వీడియోలో పేర్కొంది. హోప పెంచాలన్న ఆలోచన మంచిదే. తన పరిధిలో ఆక్సిజన్.. బెడ్స్ అవసరమైన పేదవారికి ఆర్థిక సాయం కూడా చేయాలని అభిమానులు కోరుతున్నారు. ప్రజల్ని మానసికంగా ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు ధైర్యం నింపే ప్రయత్నం చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. కొందరైతే హోప్ పెంచే ప్రయత్నంలో భాగంగా 12వ (ఇంటర్) తరగతి పరీక్షల్ని రద్దు చేయించే దిశగా కృషి చేయాలని కోరారు. తద్వారా విద్యార్థులకు కోవిడ్ సోకదని అడగడం ఆశ్చర్యపరిచింది.
రష్మిక మందన కెరీర్ మ్యాటర్ కి వస్తే తెలుగు హిందీలో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో మిషన్ మజ్ను- గుడ్ బాయ్ చిత్రాల్లో నటిస్తోంది. బన్ని సరసన పుష్ప చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.