Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ క్రేజ్ అక్క‌డ క‌నిపించ‌దే?

By:  Tupaki Desk   |   18 Nov 2022 6:44 AM GMT
అల్లు అర్జున్ క్రేజ్ అక్క‌డ క‌నిపించ‌దే?
X
టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో వున్న స్టార్ హీరోల్లో అల్లు వారబ్బాయి అల్లు అర్జున్ స్టైల్ సెప‌రేట్. 'పుష్ప‌'కు ముందు స్టైలిష్ స్టార్ గా ఆ త‌రువాత ఐకాన్ స్టార్ గా మారిపోయిన బ‌న్నీ 'పుష్ప‌' మూవీతో పాన్ ఇండియా వైడ్ గా భారీ క్రేజ్ ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా పాన్ ఇండియా స్టార్ ల జాబితాలో చేరిపోయాడు. ఉత్త‌రాదిలోనూ భారీ క్రేజ్ ని ఈ మూవీతో సొంతం చేసుకున్న బ‌న్నీ 'పుష్ఫ‌'తో అక్క‌డ ఊహించ‌ని విధంగా భారీ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన విష‌యం తెలిసిందే.

ఇదిలా వుంటే అల్లు అర్జున్ ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో హీరోగా క్రేజ్ తో పాటు భారీ ఫ్యాన్ బేస్ ని కూడా సొంతం చేసుకున్నాడు. అయితే ఉభ‌య తెలుగు రాష్ట్రాల త‌ర‌హాలోనే పొరుగున వున్న కేర‌ళ మాళీవుడ్ లోనూ అంతే క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. బ‌న్నీ సినిమా వ‌స్తోందంటే ఉభ‌య తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ ఏ రేంజ్ లో హ‌డావిడి చేయ‌డం మొద‌లు పెడ‌తారో అదే స్థాయిలో కేర‌ళ‌లోనూ మ‌ల‌యాళీ ఫ్యాన్స్ హ‌ల్ చల్ చేయ‌డం ప్రారంభిస్తారు.

అంత క్రేజ్ వున్న బ‌న్నీకి రీసెంట్ గా ఆ క్రేజ్ త‌గ్గింద‌ని, ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. మ‌ల‌యాళంలో హ‌య్యెస్ట్ గ్రాస్ ని సొంతం చేసుకున్న టాప్ టెన్ సినిమాల లిస్ట్ లో బ‌న్నీ న‌టించిన ఒక్క సినిమా కూడా చోటు ద‌క్కించుకోలేక పోవ‌డ‌మే ప్ర‌స్తుత కామెంట్ ల‌కు ప్ర‌ధాన కార‌ణంగా మారింది. మ‌ల‌యాళంలో ఇప్ప‌టి వ‌ర‌కు అత్యధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన టాప్ టెన్ సినిమాల్లో 'బాహుబ‌లి 2' నుంచి 'కాంతార‌' వ‌ర‌కు ప‌లు ప‌ది క్రేజీ సినిమాలున్నాయి.

అయితే వారంద‌రికి మించి మాళీవుడ్ లో క్రేజ్ ని వున్న అల్లు అర్జున్ న‌టించిన ఏ సినిమాకు చోటు ద‌క్క‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో నెటిజ‌న్ లు, బ‌న్నీ యాంటీ ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై కామెంట్ లు చేస్తున్నారు. అంత క్రేజ్ తో మ‌ల్లు అర్జున్ అనిపించుకున్న అల్లు అర్జున్ ఎందుకు టాప్ 10 సినిమాల్లో చేర‌లేక‌పోయాడ‌ని, ఆ క్రేజ్ ఏమైంద‌ని కామెంట్ లు చేస్తున్నారు. అంతే కాకుండా అల్లు అర్జున్ క్రేజ్ అక్క‌డ క‌నిపించ‌దే అంటూ బ‌న్నీ ఫ్యాన్స్ పై కౌంట‌ర్లు వేస్తున్నారు.

బ‌న్నీ ఫ్యాన్స్ మాత్రం టాప్ టెన్ సినిమాల్లో 'పుష్ప‌' నిలిచింద‌ని, అయితే రీసెంట్ గా ప‌లు సినిమాలు ఓవ‌ర్ టేక్ చేయ‌డంతో 'పుష్ప‌' టాప్ టెన్ లో చోటు ద‌క్కించుకోలేక‌పోయింద‌ని చెబుతున్నారు. అంతే కాకుండా 'పుష్ప 2'తో ఈ సారి క‌నీ వినీ ఎరుగ‌ని సంచ‌ల‌నాలు సృష్టించి టాప్ లో నిలుస్తామ‌ని గ‌ట్టి న‌మ్మ‌కంతో చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.