Begin typing your search above and press return to search.

కొన్ని అత్యుత్సాహాల‌కు హీరోలే బ్రేకులేయాలేమో!

By:  Tupaki Desk   |   24 March 2021 8:00 AM IST
కొన్ని అత్యుత్సాహాల‌కు హీరోలే బ్రేకులేయాలేమో!
X
గ‌తానుభ‌వాల‌ను త‌ర‌చి చూస్తే స్టార్ హీరోల ఈవెంట్ల‌కు భ‌ద్ర‌త లేద‌ని ప్రూవైంది. భారీగా అభిమానులు గుమిగూడే ఈవెంట్ల‌లో ఎవ‌రినీ ఆపే ప‌రిస్థితి ఉండ‌దు. చుట్టూ బౌన్స‌ర్లు ఉన్నా.. ఆడిటోరియం బ‌య‌ట పోలీసులు ఉన్నా కానీ అభిమానుల ఉర‌క‌లెత్తే ఉత్సాహం ముందు అవేవీ నిల‌వ‌వు.ఒక్కోసారి అభిమానులు మీది మీదికి దూసుకొస్తారు. వేదిక‌లు ఎక్కి నానా ర‌చ్చ చేస్తున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు సెల్ఫీలు దిగేందుకు హీరోల మీదికే దూకేస్తున్నారు. ఇక ఇలాంట‌ప్పుడు చుట్టూ ఏం ఉన్నా ప‌ట్టించుకోరు.

ఆ అత్యుత్సాహంలో ఎల‌క్ట్రానిక్ సెట‌ప్ ఉన్న చోట‌ క‌రెంట్ షాక్ లు.. వ‌గైరా వ‌గైరా ట్రామాలు తెలిసిందే. ఇంత‌కుముందు బాద్ షా ఈవెంట్లో ఎన్టీఆర్ అభిమాని అలానే మ‌ర‌ణించ‌డం క‌ల‌కలం రేపింది. ఆ ఈవెంట్ నిర్వాహ‌కుల‌పై కేసు న‌మోదైంది. ఆ త‌ర్వాత హీరోలు అభిమానుల‌కు జాగ్ర‌త్త‌లు చెప్ప‌డం వారించే ప్ర‌య‌త్నం చేయ‌డం తెలిసిందే. అభిమానులు త‌మ ఇండ్ల‌కు సుర‌క్షితంగా చేరుకోవాల‌ని ఏదైనా జ‌రిగితే మేం త‌ట్టుకోలేమ‌ని తార‌క్ చాలా వేదిక‌ల‌పై ఎంతో ఆవేద‌న‌గా అన్న సంద‌ర్భాలు గుర్తు తెచ్చుకోవాలి.

కానీ అవ‌న్నీ ఆ క్ష‌ణం వ‌ర‌కే.. మొన్న తెల్ల‌వారితే గురువారం ఈవెంట్ కి వెళ్లిన తార‌క్ కి ఊహించ‌ని చేదు అనుభ‌వ‌మే ఎదురైంది. అభిమానులు నేరుగా వేదిక‌పైకి దూసుకెళ్లి తార‌క్ ని ప‌డ‌గొట్టేంత ప‌ని చేసారు. వారించే ప్ర‌య‌త్నం చేసినా ఎవ‌రూ ఆగ‌లేదు. దీంతో తార‌క్ షాక‌య్యారు.

అస‌లు ఇలా ఎందుకు జ‌రుగుతోంది? అన్న‌ది ఆరాలు తీస్తే.. ఈవెంట్ నిర్వాహ‌కులు.. మేనేజ‌ర్లు.. పీఆర్ అత్యుత్సాహం ఇందులో దాగుంద‌ని గుగ‌గుస‌లు స్ప్రెడ్ అవుతున్నాయి. ఇలా భారీగా ఫ్యాన్స్ ని త‌ర‌లించ‌డం హ‌డావుడి చేయ‌డం అనే స్కీమ్ ల గురించి కూడా చ‌ర్చ సాగుతోంది. ప్రమాదం లేనంత వ‌ర‌కూ ఏదీ లేదు. అది జ‌రిగాకే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. అది ఆ హీరోకి కూడా బ్యాడ్ నేమ్ తెస్తుంది. అలా జ‌ర‌గ‌కుండా ఉండాల‌న్న‌దే విమ‌ర్శ‌‌కుల సూచ‌న‌. కొన్ని అత్యుత్సాహాల‌కు హీరోలే ముందుగా అడ్డుక‌ట్ట వేస్తేనే మేలేమో!