Begin typing your search above and press return to search.

లెక్కల మాస్టర్ 'పాన్ ఇండియా బాక్సాఫీస్' షేక్ చేయనున్నాడా..??

By:  Tupaki Desk   |   27 Dec 2020 11:30 AM GMT
లెక్కల మాస్టర్ పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ చేయనున్నాడా..??
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో రంగస్థలం లాంటి బంపర్ హిట్ సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ సుకుమార్ చాలా గ్యాప్ తీసుకున్నారు. ఎప్పుడో 2018లో విడుదలైన రంగస్థలం.. తర్వాత ఇంత పెద్ద విరామం ఎందుకు తీసుకున్నాడా అని అంతా అనుకున్నారు. కానీ కొడితే మళ్ళీ రంగస్థలం సినిమాను మించిన హిట్ కొట్టాలని ప్లాన్ చేసారని తెలుస్తుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో మూడోసారి జతకట్టిన సుకుమార్ ఈసారి ఓన్లీ తెలుగు సినిమా కాకుండా పాన్ ఇండియా మూవీ రూపొందిస్తున్నాడు. ఈ ఏడాది అల వైకుంఠపురంలో' లాంటి భారీ హిట్ తర్వాత బన్నీ సుక్కుతో ఈ సినిమా చేస్తున్నాడు. పుష్ప అనే క్రేజీ టైటిల్ ఖరారు చేసిన ఈ సినిమా పై ఇప్పటికే సుక్కు - బన్నీల అభిమానులలో అంచనాలు తారాస్థాయికి చేరాయి.

యంగ్ సెన్సేషన్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీని తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేసాయి. లెక్కల మాస్టర్ సుకుమార్ మరో ప్రయోగానికి తెరలేపాడని బన్నీ లుక్ చూస్తే అర్ధమైపోతుంది. రాయలసీమ యాస, భాషతో పాటు బన్నీ ఊరమాసు మొరటు కుర్రాడిగా ఇరగదీస్తాడని.. సినిమా కూడా ఓ లెవెల్ లో బాక్సాఫీస్ షేక్ చేస్తుందని అంటున్నాయి సన్నిహిత వర్గాలు. అడ‌వుల్లో గంధపు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవ‌ర్‌గా ఊర మాస్ పాత్ర‌లో ఎలా మెప్పిస్తాడు అనేది చూడాలి. మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.