Begin typing your search above and press return to search.
భోళా శంకర్ వీరయ్యని దాటగలడా..?
By: Tupaki Desk | 24 Feb 2023 7:00 AMఆచార్యతో డీలా పడ్డ మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సక్సెస్ తో ఫుల్ జోష్ గా కనిపిస్తున్నాడు. డైరెక్టర్ బాబీ చిరుకి సక్సెస్ అందించి మరో మెట్టు ఎక్కాడు. సినిమా సక్సెస్ లో డైరెక్టర్ పాత్ర ఎక్కువే అయినా చిరు తన సినిమాల విషయంలో ఎక్కువ జోక్యం చేసుకోవడం ఆ సినిమా ఫలితాల మీద ఎఫెక్ట్ పడుతుందన్న వార్త ఎప్పటి నుంచో ఉంది. అయితే బాబీ మాత్రం చిరు ఇచ్చిన సలహాలు తీసుకుని కూడా వాల్తేరు వీరయ్యని తను అనుకున్నట్టుగా తీయగలిగాడు. ఫైనల్ గా రిజల్ట్ మెగాస్టార్ ని సంతృప్తి పరచింది.
ఇక ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు చిరు. వేదాళం రీమేక్ గా సిస్టర్ సెంటిమెంట్ కథతో వస్తున్న ఈ మూవీపై మెగా ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. చిరు మళ్లీ రాంగ్ ట్రాక్ లోకి వెళ్తున్నారా.. అయినా అసలేమాత్రం ఫాం లో లేని మెహర్ రమేష్ డైరెక్షన్ లో సినిమా ఎందుకు చేస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కానీ ప్రచార చిత్రాలతో మెహర్ రమేష్ మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేసే పనిలో ఉన్నాడు. అయితే వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి భోళా శంకర్ అన్ని విషయాల్లో ఆ సినిమాను అధిగమించాలని చూస్తుంది.
కానీ చిరు మాత్రం ఆచార్య చేసిన తప్పులు చేయకుండా ఈ సినిమా బడ్జెట్ అయిన దాని ప్రకారంగానే బిజినెస్ చేయాలని చెప్పారట. చిరు మార్కెట్ కి బిజినెస్ పెరగడమే కానీ తగ్గడం ఉండదు కానీ పెట్టిన బడ్జెట్ కి కొద్దిగా లాభం చూసుకుని బిజినెస్ ఇచ్చేయమని చిరు చెప్పారట.
మరీ ఎక్కువ ఆశించి ఇస్తే సినిమా రిజల్ట్ తేడా కొడితే అసలకే మోసం వస్తుందని చెప్పారట. సో బిజినెస్ విషయంలో భోళా శంకర్ వాల్తేరు వీరయ్యకు అటు ఇటుగా ఉంటుందని తెలుస్తుంది.
అంతేకాదు ఈ సినిమా కథ సిస్టర్ సెంటిమెంట్ అయినా మెగా ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ మెహర్ రమేష్. సో ఎలా చూసినా మెగా ఫ్యాన్స్ కి భోళా శంకర్ మరో మెగా ట్రీట్ అందించేందుకు వస్తుందని చెప్పొచ్చు. సినిమాలో చిరుతో తమన్నా జోడీ కడుతుండగా మహానటి కీర్తి సురేష్ మెగాస్టార్ కి సిస్టర్ రోల్ లో నటిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.