Begin typing your search above and press return to search.

బాలయ్యతో ఆ ప్రాబ్లెం లేదన్న నిర్మాత

By:  Tupaki Desk   |   12 Oct 2017 5:03 AM GMT
బాలయ్యతో ఆ ప్రాబ్లెం లేదన్న నిర్మాత
X
కేఎస్ రవి కుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ శరవేగంగానే సాగుతోంది. రాబోయే సంక్రాంతి నాటికి ఈ సినిమాను సిద్ధం చేయాలన్నది మేకర్స్ ఆలోచన. షూటింగ్ కి అయితే ప్రాబ్లెమ్స్ ఏమీ లేవు కానీ.. బాలకృష్ణకు అసిస్టెంట్స్ ను అందించాలంటే మాత్రం తలప్రాణం తోకకొస్తోందని రీసెంట్ గా ఓ టాక్ బయల్దేరింది.

ఈ మూవీ లాంఛింగ్ లోనే ఓ అసిస్టెంట్ ను చాచిపెట్టి కొట్టారనే న్యూస్ ఉంది. రీసెంట్ గా ఇలాంటి సంఘటనలు చాలానే జరిగిన సంగతి మీడియాలో చూశాం. దీంతో బాలయ్యకు అసిస్టెంట్ గా ఉండేందుకు ఎవరూ అంగీకరించడం లేదని.. కొంతమంది అయితే మానేసి మరీ వెళ్లిపోయారనే ఓ టాక్ వచ్చింది. ఇది నిజంగా జరుగుతోందో లేదో తెలియదు కానీ.. ఈ న్యూస్ మాత్రం ఎక్కువగానే వినిపిస్తోంది. దీంతో ఇప్పుడీ వార్తలపై నిర్మాత సి కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. బాలయ్యతో పని చేయడంపై తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావడం లేదని తేల్చేశారు ఆయన. అయినా.. ఒక అసిస్టెంట్ అదే తప్పు మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తే.. కొట్టడంలో తప్పేమీ లేదని కూడా సెలవిచ్చారీయన.

'పబ్లిక్ ఈవెంట్స్ లో యాక్టర్స్ చుట్టూ బౌన్సర్స్ ఉంటారు. ఏదైనా తేడా వస్తే వాళ్లు మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తారు. కానీ బాలయ్య మాత్రం తన దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నించిన వారిని కంట్రోల్ చేయడానికి కొడతారంటే' అని సి కళ్యాణ్ ఉవాచ.