Begin typing your search above and press return to search.

RRR తర్వాత ప్రభాస్ తో వార్ ఫిలిం..నిజమైతే కేకే

By:  Tupaki Desk   |   8 Feb 2020 2:00 AM IST
RRR తర్వాత ప్రభాస్ తో వార్ ఫిలిం..నిజమైతే కేకే
X
ప్రసుతం భారతదేశం లో క్రేజీ డైరెక్టర్ ఎవరంటే తడుముకోకుండా ఎక్కువమంది ఎస్ ఎస్ రాజమౌళి పేరు చెప్తారు. 'బాహుబలి' ఫ్రాంచైజీ ఘనవిజయంతో రాజమౌళి పాపులరిటీ భారీగా పెరిగింది. అందుకే రాజమౌళి నెక్స్ట్ సినిమా 'RRR' ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించడంతో మరోసారి రాజమౌళి సంచలనం సృష్టించడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి.

ఎన్టీఆర్.. చరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాజమౌళి 'RRR' తర్వాత ఎవరితో చేస్తున్నారనే విషయంపై పలురకాల వార్తలు వస్తున్నాయి. రాజమౌళి మరోసారి ప్రభాస్ తో ఒక యుద్ధ నేపథ్యంలో భారీ సినిమా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఈ సినిమాలో మహేష్ కూడా నటిస్తారని.. యూవీ క్రియేషన్స్.. కెయల్ యూనివర్సిటీ ఓనర్ కెయల్ నారాయణ కలిసి ఈ సినిమాను నిర్మిస్తారని అంటున్నారు. మహేష్ డేట్స్ కేయల్ నారాయణ దగ్గర ఉన్నాయని ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కు సంబంధించిన చర్చలు సాగుతున్నాయని అంటున్నారు.

మరి ఈ వార్తలో ఎంతమేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ రాజమౌళి-ప్రభాస్ సినిమా.. అదీ యుద్ధం నేపథ్యంలో కథ అంటే ఆ క్రేజ్ భారీగా ఉంటుంది. ఇక ఆ సినిమాలో మహేష్ బాబు నటిస్తారు అంటే అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. తొలిసారి ప్రభాస్-మహేష్ కాంబినేషన్ తెలుగు ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందనడం లో ఏమాత్రం సందేహం లేదు. సినీ ప్రేమికులు ఈ వార్త నిజం కావాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నారు.