Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్ Vs మ‌హేష్ Vs బ‌న్ని.. ఇంత‌కీ జాన్వీ ఎవ‌రితో?

By:  Tupaki Desk   |   17 Aug 2021 5:23 AM GMT
చ‌ర‌ణ్ Vs మ‌హేష్ Vs బ‌న్ని.. ఇంత‌కీ జాన్వీ ఎవ‌రితో?
X
మెగా కాంపౌండ్ సినిమాతో అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి వార‌సురాలు జాన్వీ క‌పూర్ టాలీవుడ్ ఆరంగేట్రం చేస్తుంద‌ని క‌థ‌నాలొచ్చాయి. జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి సీక్వెల్ లో చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించేందుకు ఆస్కారం ఉంద‌ని చాలా కాలంగా ప్ర‌చారం ఉంది. అయితే ఈ సినిమాని తెర‌కెక్కించాల‌ని అశ్వ‌నిద‌త్ ప్ర‌య‌త్నించినా ఎందుక‌నో కుద‌ర‌లేదు.

ఇటీవ‌ల కొంత‌కాలంగా మ‌హేష్ న‌టించే త‌దుప‌రి చిత్రంలో జాన్వీ క‌పూర్ న‌టిస్తుంద‌ని ఈ సినిమా త‌న‌కు టాలీవుడ్ ప్ర‌వేశ చిత్రం అవుతుంద‌ని ర‌క‌ర‌కాల క‌థ‌నాలొచ్చాయి. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో ఈ సినిమా తెర‌కెక్కాల్సి ఉంది.

ఇప్పుడు టోన్ మారింది. జాన్వీ చ‌ర‌ణ్ తో కాదు .. మ‌హేష్ తో కానే కాదు.. బ‌న్నీతో ఎంట్రీ ఇస్తుంది! అంటూ మ‌రో కొత్త పుకార్ షికార్ చేస్తోంది. అల్లు అర్జున్ సరసన జాన్వీ తెలుగు తెరకు పరిచయం అవుతుంద‌ని ఒక‌టే గుస‌గుస వినిపిస్తోంది. మామ్ శ్రీదేవి అడుగుజాడల్లో తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో స‌త్తా చాటాల‌ని జాన్వీ ఉవ్విళ్లూరుతోందిట‌. అల్లు అర్జున్ న‌టించ‌నున్న ఐకాన్ లో జాన్వీ న‌టించే వీలుంది.

ఇక ఈ మూవీకి కొత్త ముఖాల్ని వెతికే క్ర‌మంలో అల్లు అర‌వింద్ ప‌లువురు బాలీవుడ్ యువ‌ నాయిక‌ల పేర్ల‌ను ప‌రిశీలించారు. అందులో సారా అలీఖాన్ .. జాన్వీ క‌పూర్ పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. ఇక త్వ‌ర‌లోనే తెలుగులో డెబ్యూ న‌టిగా ప‌రిచ‌యం కావాల‌ని ఉవ్విళ్లూరుతున్న ఖుషీ క‌పూర్ పేరును.. లైగ‌ర్ బ్యూటీ అన‌న్య పేరును కూడా అనుకున్నార‌ట‌.

అయితే అంద‌రి దృష్టి చివ‌రికి జాన్వీ క‌పూర్ ని వీడి వెళ్ల‌డం లేద‌ని త‌న డెబ్యూ ఖాయ‌మైన‌ట్టేన‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే జాన్వీ పీఆర్ తో ద‌ర్శ‌కుడు వేణు శ్రీ‌రామ్.. నిర్మాత దిల్ రాజు ట‌చ్ లో ఉన్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. ఐకాన్ కి ఎంపిక‌య్యే ఛాన్సుంద‌ని చెబుతున్నారు. ఐకాన్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. చ‌ర‌ణ్ తో లేదు మ‌హేష్ తో లేదు ఇక బ‌న్నీతో అయినా క‌న్ఫామ్ అయిన‌ట్టేనా? అన్న‌దానికి త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.

జాన్వీ లైన‌ప్ చూస్తే షాక‌వ్వాల్సిందే..

బాలీవుడ్ లో న‌వ‌త‌రం క‌థానాయిక‌ల హ‌వా చూస్తుంటే చిక్క‌రు దొర‌క‌రు అన్నంత బిజీగా ఉన్నారు. సారా అలీఖాన్- అన‌న్య పాండే కాల్షీట్లు అంత సులువేమీ కాదు. జాన్వీ క‌పూర్ ఆ ఇద్ద‌రి కంటే బిజీ తార‌. అందుకే త‌న డెబ్యూ మూవీ ఎవ‌రితో ఉంటుంది? అన్న‌ది క‌న్ఫామ్ గా చెప్ప‌లేని పరిస్థితి. అధికారికంగా ఫలానా హీరో స‌ర‌స‌న న‌టిస్తోంది అంటూ ప్ర‌క‌ట‌న వెలువ‌డితే కానీ ఖాయం చేయ‌లేని ప‌రిస్థితి ఉంది.

ఇక జాన్వీ కెరీర్ సంగ‌తులు చూస్తే షాక‌వ్వాల్సిందే. బాలీవుడ్ ఇండ‌స్ట్రీ బిజీయెస్ట్ స్టార్ గా వెలిగిపోతోంది. 2021 మార్చిలో ఆమె చిత్రం రూహి విడుదలైంది. దీనికి అభిమానుల నుండి మిశ్రమ స్పందన లభించింది. ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావు కూడా ప్రధాన పాత్రలో నటించారు. జాన్వీ కపూర్ తన తదుపరి ప్రాజెక్ట్ మిలి కోసం షూటింగ్ ప్రారంభించినట్లు తెలిసింది. ఈ చిత్రం మలయాళ చిత్రం - హెలెన్ కి హిందీ రీమేక్. మ‌ల‌యాళ వెర్ష‌న్ కి చిత్రానికి దర్శకత్వం వహించిన మత్తుకుట్టి జేవియర్ దీనికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. హెలెన్ లో అన్నా బెన్ నటించింది. ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. క‌ర‌ణ్ జోహార్ దోస్తానా 2లోనూ జాన్వీ క‌పూర్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.