Begin typing your search above and press return to search.

సరదాగా సర్ధార్‌ మీద పడుతున్నారు

By:  Tupaki Desk   |   21 Aug 2015 7:00 PM IST
సరదాగా సర్ధార్‌ మీద పడుతున్నారు
X
పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా బాబి దర్శకత్వంలో 'సర్ధార్‌ గబ్బర్‌ సింగ్‌' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ప్రతి విషయాన్ని పవన్‌ ఎంతో శ్రద్ధ తీసుకుని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే లో పవన్‌ ఇన్‌ పుట్స్‌ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో గబ్బర్‌ సింగ్‌ ని మించిన హిట్‌ కొట్టాలన్నది ప్లాన్‌. ఇటీవలే అమీర్‌ పేట (హైదరాబాద్‌)లో కీలకసన్నివేశాల షూటింగ్‌ పూర్తి చేసుకున్నారు. త్వరలోనే యూనిట్‌ పూణే వెళ్లేందుకు సిద్ధమవుతోంది.

పవన్‌ తన స్నేహితుడు శరత్‌ మరార్‌ తో కలిసి స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కార్పొరెట్‌ దిగ్గజం ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. మహేష్‌ శ్రీమంతుడు 100కోట్ల మార్క్‌ ని టచ్‌ చేయడంతో సర్ధార్‌ పై ఆ మ్యాజిక్‌ బలంగా పనిచేస్తోందని మార్కెట్‌ వర్గాల నుంచి తెలుస్తోంది. పవన్‌కి ఉన్న క్రేజు దృష్ట్యా డిస్ట్రిబ్యూటర్స్‌ ఇప్పటినుంచే పోటీపడుతున్నారు. కొన్ని ఏరియాల హక్కులకు సంబంధించి ఎంక్వయిరీలు చేస్తున్నారని సమాచారం.

ఇంకా 50శాతం అయినా షూటింగ్‌ పూర్తవ్వకుండానే బిజినెస్‌ ఎంక్వయిరీలు మొదలయ్యాయి. పవన్‌ ఓకే అనాలే కానీ భారీ మొత్తాల్ని అడ్వాన్సులుగా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారంతా. శ్రీమంతుడు తర్వాత మరో 100కోట్ల ప్రాజెక్ట్‌ సర్ధార్‌ గబ్బర్‌ సింగ్‌ అవుతుందని అంచనాలేస్తున్నారంతా.