Begin typing your search above and press return to search.

చేతులు కాలుతున్నాయి రాజా

By:  Tupaki Desk   |   20 Nov 2018 6:16 AM GMT
చేతులు కాలుతున్నాయి రాజా
X
ఏదైనా తీవ్ర నష్టం కలిగి కోలుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు చేతులు కాలాయి అంటాం కదా ఇప్పుడు ఇదే మాటని రవితేజ సినిమాలను కొంటున్నవాళ్ళు అంటున్నారు. అభిమానులకు చేదుగా అనిపించినా వాస్తవం మాత్రం ఇదే. మొన్న వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ కనీస అంచనాలు అందుకోలేక దారుణమైన డిజాస్టర్ గా మిగిలే దిశగా ప్రయాణం చేస్తోంది. పోనీ యావరేజ్ అనిపించుకున్నా వీకెండ్ వసూళ్లతో కొంత వరకు సేఫ్ అయ్యే అవకాశం ఉండేది కానీ దీనికి ఆ ఛాన్స్ కూడా లేదని లేదని చాలా చోట్ల సండే సైతం హౌస్ ఫుల్స్ కాకపోవడమే నిదర్శనమని అంటున్నారు.

ఈ ఏడాది ఎన్నడూ లేనిదీ రవితేజ మొత్తం మూడు దారుణ పరాజయాలు మూటగట్టుకున్నాడు. అంతకు మించి అనేలా ముందుదే బెటర్ అనుకునేలా ఒక్కొక్కటి సూపర్ ప్లాప్ అయ్యాయి. బయటికి కనిపించకపోయినా ఇది రవితేజ మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కథల ఎంపికలో స్వీయ తప్పిదాలు కనిపిస్తున్నా పదే పదే ఒకే మూసలోకి రవితేజ ఎందుకు వెళ్తున్నాడో ఎవరికి అంతు చిక్కడం లేదు. డిస్ట్రిబ్యూటర్లు సైతం రవితేజ సినిమాల పట్ల ఏ మాత్రం హ్యాపీగా లేరన్నది ట్రేడ్ రిపోర్ట్. పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ బయ్యర్ అఫ్ ది రికార్డు మాట్లాడుతూ ఒకప్పుడు రవితేజ సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉండేదని కాని ఇప్పుడు అలా కాదని ఆయన పారితోషికం చక్కగా అందినా మాస్ రాజా ఇమేజ్ ని నమ్ముకుని సినిమాలు కొన్న తాము మాత్రం విపరీతంగా నష్టాల పాలవుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేసారు. ఇక ముందు రవితేజ సినిమాలు కొనే సాహసం చేయనని చెప్పడం గమనార్హం.

రవితేజ ఖచ్చితంగా ఈ పరిణామాన్ని విశ్లేషించుకోవడం బెటర్. ఇప్పుడు విఐ ఆనంద్ తో సైన్సు ఫిక్షన్ కు రెడీ అవుతున్న రవితేజ తననుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు అనే విషయంలో క్లారిటీ మిస్ అవుతూ ఇంకా పదేళ్ళ వెనక్కే ఉన్నాడు. ఆలోచనా ధోరణిలో మార్పు రాకపోతే ఇప్పుడు ఉన్న మార్కెట్ పూర్తిగా జీరో అయిపోయే ప్రమాదం ఉంది. మరి మాస్ మహారాజా ఈ విషయంలో త్వరగా మేలుకుని కథల విషయంలో జాగ్రత్తగా ఉంటే బెటర్.