Begin typing your search above and press return to search.

బుట్ట‌బొమ్మ థ‌ర్డ్ ఐట‌మ్ సాంగ్ .. అదెలా?

By:  Tupaki Desk   |   15 April 2022 12:30 PM GMT
బుట్ట‌బొమ్మ థ‌ర్డ్ ఐట‌మ్ సాంగ్ .. అదెలా?
X
త‌మిళ చిత్రం 'మూగ‌ముడి'చిత్రంతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే. ఇక తెలుగులో నాగ‌చైత‌న్య న‌టించిన 'ఒక లైలా కోసం' మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌రువాత చేసిన 'ముకుంద‌' చిత్రంతో కొంత వ‌ర‌కు ఫ‌ర‌వాలేద‌నిపించింది. అంత వ‌ర‌కు పూజా కు పెద్ద‌గా క్రేజ్ లేదు. ఎప్ప‌డుడైతే 'డీజే దువ్వ‌డా జ‌గ‌న్నాథమ్‌' చిత్రంలో స్విమ్మింగ్ పూల్ లో బికినీతో ద‌ర్శ‌న‌మిచ్చిందో టాలీవుడ్ లో అమ్మ‌డి జాత‌కం అప్పుడే మారిపోయింది.

బ‌న్నీ హీరోగా హ‌రీష్ శంక‌ర్ రూపొందించిన ఈ చిత్రం పూజా హెగ్డే కెరీర్ ని తెలుగులో ఓ రేంజ్ లో మ‌లుపు తిప్పేసింది. స‌క్పెస్‌, ఫెల్యూర్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ఆఫ‌ర్లు వ‌రించాయి. తెలుగ‌లో ఇంత క్రేజ్ వున్నా ఆ మ‌ధ్య కొన్ని చిత్రాల‌కు పూజా హెగ్డే అంగీక‌రించిన త‌రువాత షాకిచ్చింది. డేట్స్ స‌మ‌స్య అంటూ త‌ప్పుకుని మ‌ళ్లీ చివ‌రి నిమిషంలో ఓకే చెప్పేసింది. అయినా స‌రే మ‌న వాళ్లు పూజా హెగ్డేనే కావాలంటూ వెంట‌ప‌డుతున్నారు.

ఇదిలా వుంటే పూజా హెగ్డే ని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. పూజా ముచ్చ‌ట‌గా మూడ‌వ ఐట‌మ్ సాంగ్ చేస్తోందంటూ నెట్టింట పూజను ఏకేస్తున్నారు. ఇటీవ‌ల త‌మిళ స్టార్ హీరో విజ‌య్ తో క‌లిసి పూజా 'బీస్ట్‌' చిత్రంలో న‌టించింది. ఏప్రిల్ 13న ఈ చిత్రం విడుద‌లై ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది.

ఇదిలా వుంటే తాజాగా పూజా హెగ్డే 'ఎఫ్ 3'లో ఐటమ్ సాంగ్ చేయ‌డానికి అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. ఈ పాట కోసం భారీగానే పారితోషికం డిమాండ్ చేసిన పూజా శుక్ర‌వారం నుంచి సాంగ్ షూటింగ్ లో పాల్గొంటోంది.

విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ల‌తో క‌లిసి పూజా ఐట‌మ్ సాంగ్ చేస్తున్న ఫొటోలు తాజాగా బ‌య‌టికి వ‌చ్చాయి. ఈ షొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజ‌న్ లు పూజా థ‌ర్డ్ ఐట‌మ్ సాంగ్ అంటూ ప్ర‌చారం చేస్తున్నారు. అదెలా అంటే 'రంగ‌స్థ‌లం'లో చేసిన పాట మొద‌టిద‌ని, 'బీస్ట్‌'లో చేసిర అర‌బ్బిక్కూత్తు రెండ‌వ ద‌ని, 'ఎఫ్ 3' లో చేస్తున్న పాట మూడ‌వ‌ద‌ని చ‌మత్క‌రిస్తూ ట్రోల్ చేస్తున్నారు.

ఈ మూవీ స‌మ‌యంలో మ‌హేష్ - త్రివిక్ర‌మ్ చిత్రంలో న‌టించ‌డానికి డేట్స్ స‌మ‌స్య త‌లెత్తిన‌ట్టుగా ప్ర‌చారం చేసిన పూజా హెగ్డే ఆ త‌రువాత మ‌ళ్లీ మ‌హేష్ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇక పూజా హెగ్డే తాజాగా 'ఎఫ్ 3' చిత్రంలో స్పెష‌ల్ ఐటమ్ సాంగ్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డానికి రాధేశ్యామ్‌, బీస్ట్ చిత్రాలే న‌ని చెబుతున్నారు. ఈ రెండు భారీ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ కావ‌డంతో ఆ దృష్టిని మ‌ళ్లించ‌డానికే స‌మంత త‌ర‌హాలో స్పెష‌ల్ సాంగ్ కు పూజా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని నెట్టింట కామెంట్ లు వినిపిస్తున్నాయి.