Begin typing your search above and press return to search.

మరో సారి సెన్సేషన్ క్రియేట్ చేసిన 'బుట్ట బొమ్మ'

By:  Tupaki Desk   |   23 May 2021 8:30 AM GMT
మరో సారి సెన్సేషన్ క్రియేట్ చేసిన బుట్ట బొమ్మ
X
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కెరీర్ 'అలవైకుంఠపురములో' ముందు ఆ తర్వాతగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సినిమాలోని పాటలు సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. ముందుగా ఈ సినిమా నుంచి విడుదలైన సామజవరగమన సాంగ్ సూపర్ హిట్ గా నిలిచి ఆ సినిమాకు భారీ బజ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత విడుదలైన సాంగ్స్ బుట్ట బొమ్మ, రాములో రాములా.. దాని కంటే సూపర్ హిట్ గా నిలిచాయి.ఇక బుట్ట బొమ్మ సాంగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సాంగ్ కు కాలు కదపని హీరో,హీరోయిన్ లేడు.

టిక్ టాక్ లో అయితే ఈ పాట మోత మోగింది. పలువురు బాలీవుడ్ హీరోయిన్లు బుట్ట బొమ్మ సాంగ్ కి తమదైన స్టయిల్లో స్టెప్పులు వేసి అలరించారు. ఇక ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ వార్నర్ అయితే తన భార్య తో కలిసి బుట్ట బొమ్మ సాంగ్ కు డ్యాన్స్ వేసి టిక్ టాక్ లో అప్ లోడ్ చేశాడు. వీరు వారు అని కాదు సెలబ్రిటీలు అందరూ బుట్ట బొమ్మ సాంగ్ కు ఫిదా అయిపోయారు.

ఇక యూట్యూబ్లో ఈ సాంగ్ చరిత్ర సృష్టిస్తోంది. ఇప్పటికే అత్యధిక వ్యూస్ సాధించిన సాంగ్ గా రికార్డులు క్రియేట్ చేసిన 'బుట్ట బొమ్మ ' తాజాగా మరో రికార్డు క్రియేట్ చేసింది. బుట్ట బొమ్మ సాంగ్ ఫోర్ మిలియన్ల లైక్స్ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. తెలుగులో ఇప్పటి వరకు ఏ పాట ఇన్ని లైక్స్ పొందలేదు. అలాగే బుట్టబొమ్మ వీడియో సాంగ్ కూడా యూట్యూబ్ లో ఇప్పటిదాకా 615 మిలియన్ల వ్యూస్ సాధించి ఏ తెలుగు సినిమా పాటకు అందనంత ఎత్తులో దూసుకుపోతోంది. అలాగే రాములో రాములా వీడియో సాంగ్ కూడా 360 మిలియన్ల వ్యూస్ సాధించడంతో పాటు టూ మిలియన్ల లైక్స్ వచ్చాయి. ఫిదా సినిమాలోని 'వచ్చిందే మెల్లా మెల్లగ వచ్చిందే ' వీడియో సాంగ్ యూట్యూబ్ లో బుట్ట బొమ్మ తర్వాత స్థానంలో ఉంది.